Home /News /coronavirus-latest-news /

AHMEDABAD HOSPITAL CREATES SEPARATE HINDU MUSLIM WARDS GOVT SAYS NOT AWARE BA

హిందు, ముస్లింలకు వేర్వేరు వార్డులు పెట్టిన ఆస్పత్రి...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సహజంగా ఆస్పత్రుల్లో పురుషులు, మహిళలకు వేర్వేరు వార్డులు ఉంటాయి. అయితే, ఈ ఆస్పత్రిలో మాత్రం హిందువులు, ముస్లింల కోసం వేర్వేరు వార్డులు ఏర్పాటు చేశారు.

    అహ్మదాబాద్ ప్రజా ఆస్పత్రిలో హిందువులు, ముస్లింల కోసం ప్రత్యేకంగా వార్డులను ఏర్పాటు చేశారు. కరోనా పరీక్షల కోసం వచ్చేవారు, కరోనా పాజిటివ్ వచ్చిన వారిని ఇలా మతం ప్రాతిపదికన విభజించి వారిని వేర్వేరు వార్డుల్లో ఉంచుతున్నట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనాన్ని వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం హిందువులు, ముస్లింలకు రెండు వేర్వేరు వార్డులు ఏర్పాటు చేసినట్టు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ గుణవంత్ హెచ్ రాథోడ్ తెలిపినట్టు ఆ కథనంలో పేర్కొంది. అయితే, అలాంటిదేమీ ప్రభుత్వం దృష్టికి రాలేదని గుజరాత్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ & హెల్త్ మినిస్టర్ నితిన్ పటేల్ కొట్టిపారేశారు.

    సహజంగా ఆస్పత్రుల్లో పురుషులు, మహిళలకు వేర్వేరు వార్డులు ఉంటాయి. అయితే, ఈ ఆస్పత్రిలో మాత్రం హిందువులు, ముస్లింల కోసం వేర్వేరు వార్డులు ఏర్పాటు చేశామని డాక్టర్ రాథోడ్ చెప్పినట్టు ఆ కథనంలో పేర్కొంది. అలా ఎందుకు చేశారని డాక్టర్‌ను ప్రశ్నించగా, ప్రభుత్వం చెప్పినందుకే తాము అలా చేశామని చెప్పినట్టు తెలిపింది. అహ్మదాబాద్ ఆస్పత్రిలో ఇప్పటి వరకు 186 మంది కరోనా వైరస్ బాధితులు ఉన్నారు. అందులో 150 మందికి పాజిటివ్ అని తేలింది. మిగిలిన వారి పరీక్షల రిపోర్టుల కోసం వెయిట్ చేస్తున్నారు. వారిలో 40 మంది ముస్లింలు ఉన్నట్టు తెలుస్తోంది. గుజరాత్‌లో 695 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఏప్రిల్ 15వ తేదీన 56 మందికి కొత్తగా కరోనా సోకినట్టు నిర్ధారించారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Coronavirus, Covid-19, Gujarat, Muslim Minorities

    తదుపరి వార్తలు