రెండు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు.. 23 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

భారీ సంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలకు కరోనా సోకితే.. ఇక సాధారణ ప్రజల సంగతిని ఊహించవచ్చని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: August 26, 2020, 8:48 PM IST
రెండు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు.. 23 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న పలు రాష్ట్రాలు.. కరోనా లేదని నిర్ధారణ అయితేనే సభలోకి ఎంట్రీ ఇవ్వాలని నిబంధన పెడుతున్నాయి. ఈ కారణంగా అసెంబ్లీ సమావేశాలకు కొద్దిరోజుల ముందుగానే ఎమ్మెల్యేలకు కరోనా టెస్టులు చేస్తున్నారు. ఇలా పంజాబ్‌ అసెంబ్లీలోని 117 మంది ఎమ్మెల్యేలకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. వారిలో 23 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ తెలిపారు. ఈ నెల 28 ఒక రోజు అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన పంజాబ్ ప్రభుత్వం.. ఇందుకోసం ముందుగానే ఎమ్మెల్యేలకు కరోనా పరీక్షలు చేయిస్తోంది. ఈ పరీక్షల్లో 23 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది.

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన బీజేపీయేతర ఏడు రాష్ట్రాల సీఎంల ఆన్‌లైన్ సమావేశంలో సీఎం అమరీందర్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంత భారీ సంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలకు కరోనా సోకితే.. ఇక సాధారణ ప్రజల సంగతిని ఊహించవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి చాలా దారుణంగా ఉన్నదని సీఎం అమరీందర్ సింగ్ తెలిపారు. ఇక పంజాబ్‌లో ఇప్పటివరకు 44577 కేసులు నమోదయ్యాయి. వీరిలో 29145 మంది వైరస్ నుంచి కోలుకోగా, 1178 మంది కరోనా కారణంగా చనిపోయారు.
Published by: Kishore Akkaladevi
First published: August 26, 2020, 8:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading