తెలంగాణ సీఎంఆర్‌ఎఫ్‌కు రిలయన్స్ రూ.5కోట్ల విరాళం...

ప్రధానమంత్రి పిలుపు మేరకు PM CAREకు రూ.530 కోట్లు విరాళం ఇచ్చిన రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా తెలంగాణ సీఎంఆర్‌ఎఫ్‌కు రూ.5 కోట్లు అందించింది.

news18-telugu
Updated: April 10, 2020, 6:59 PM IST
తెలంగాణ సీఎంఆర్‌ఎఫ్‌కు రిలయన్స్ రూ.5కోట్ల విరాళం...
రిలయన్స్ తరఫున తెలంగాణ CMRFకు రూ.5 కోట్ల విరాళాన్ని అందజేస్తున్న జియో తెలంగాణ సీఈవో కేసీ రెడ్డి
  • Share this:
కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి (CMRF) రూ .5 కోట్లు అందించింది. జియో తెలంగాణ సీఈఓ కేసీ రెడ్డి, ఆర్ఐఎల్ కార్పొరేట్ వ్యవహారాల అధికారి కమల్ పొట్లపల్లి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను కలిసి రూ.5 కోట్ల విరాళానికి సంబంధించిన లేఖను అందజేశారు. కోవిడ్ -19 కు వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలన్న ప్రధానమంత్రి పిలుపునకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటికే స్పందించింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం చేయడంతో పాటు PM-CARES సహాయ నిధికి రిలయన్స్ ఇప్పటికే రూ. 530 కోట్లు అందించింది. కరోనా వైరస్ మహమ్మారి తీసుకువచ్చిన సవాళ్లకు వ్యతిరేకంగా పోరాడటానికి దేశం సిద్ధంగా ఉందని తెలియజేసేందుకు ఆర్ఐఎల్ తన 24x7 సేవలను కొనసాగిస్తుంది. క్షేత్రస్థాయిలో ఆహారం, సరఫరాను కొనసాగిస్తుంది. తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.5కోట్లు విరాళం అందించడంతో కేటీఆర్ స్వాగతించారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి కృతజ్ఞతలు చెప్పారు.కరోనాపై పోరాటంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఫౌండేషన్ ముందున్నాయి. భారతదేశంలోనే మొట్టమొదటి 100 పడకల ప్రత్యేకమైన కోవిడ్ -19 హాస్పిటల్‌‌ రిలయన్స్ సహకారంతో ముంబైలో ఏర్పాటైంది. కోవిడ్ -19 బాధితులకు చికిత్స అందించేందుకు దీన్ని కేవలం రెండు వారాల్లోనే సిద్ధం చేశారు. దేశవ్యాప్తంగా రోజుకు 50 లక్షల ఉచిత భోజన ప్యాకెట్లు అందించే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది.

ఆరోగ్య కార్యకర్తలు, భద్రతా సిబ్బంది కోసం రోజూ లక్ష మాస్క్‌లు ఉత్పత్తి చేస్తోంది. రోజూ వేలాది పీపీఈలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా నోటిఫైడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాహనాలకు ఉచిత ఇంధనం (పెట్రోల్, డీజిల్) అందిస్తోంది. రిలయన్స్ రిటైల్ ప్రతిరోజూ మిలియన్ల మంది భారతీయులకు హోమ్ డెలివరీల ద్వారా అవసరమైన సామాగ్రిని అందిస్తోంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: April 10, 2020, 6:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading