హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

ప్రముఖ నిర్మాతకు కరోనా పాజిటివ్... ఇద్దరు కుమార్తెలకు కూడా..

ప్రముఖ నిర్మాతకు కరోనా పాజిటివ్... ఇద్దరు కుమార్తెలకు కూడా..

అలా చేయడం వల్ల కరోనా బాధితులను త్వరగా గుర్తించవచ్చని, మరికొందరికి వ్యాపించే ప్రమాదాన్ని తప్పించవచ్చని కేంద్రం అభిప్రాయపడింది.

అలా చేయడం వల్ల కరోనా బాధితులను త్వరగా గుర్తించవచ్చని, మరికొందరికి వ్యాపించే ప్రమాదాన్ని తప్పించవచ్చని కేంద్రం అభిప్రాయపడింది.

బాలీవుడ్ నిర్మాత కరోనా బారిన పడ్డారు. ఆయన ఇద్దరు కుమార్తెలకు కూడా పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది.

బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాత కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. దీంతో ఆయనను ముంబైలోని నానావతి ఆస్పత్రికి తరలించారు. గతంలో ఆయన ఇద్దరు కుమార్తెలు కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. ‘ఔను. ఆయనకు కరోనా వచ్చి ఉంటుందని మేం కూడా అనుకున్నాం. ఎందుకంటే నానావతి ఆస్పత్రిలో కుమార్తెలకు చికిత్స జరుగుతున్నప్పుడు ఆయన వారితోనే ఉన్నారు.’ అని నిర్మాత సోదరుడు తెలిపారు. మార్చి మొదటి వారంలోనిర్మాత కుమార్తె శ్రీలంక నుంచి భారత్‌కు తిరిగి వచ్చారు. ఆమెకు కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో గత సోమవారం నానావతి ఆస్పత్రిలో చేర్చారు. రెండో కుమార్తె కొన్నిరోజుల క్రితం రాజస్థాన్ నుంచి వచ్చారు. ఆమెకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఆమెకు కోకిలాబెన్ ధీరుబాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఇద్దరికీ నానావతి ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ అందిస్తున్నట్టు సదరు నిర్మాత తెలిపారు. నిర్మాత కుటుంబసభ్యులతో పాటు ఇంట్లో పనిచేసే వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందర్నీ క్వారంటైన్‌కు పంపారు. బాలీవుడ్‌లో ఆయన షారుక్ ఖాన్‌తో రావన్, చెన్నై ఎక్స్‌ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్, దిల్ వాలే లాంటి సినిమాలను నిర్మించారు.

First published:

Tags: Bollywood, Coronavirus, Covid-19, Maharashtra

ఉత్తమ కథలు