కరోనా లాక్‌డౌన్ తర్వాత సినిమా థియేటర్స్‌లో కొత్త రూల్స్ ఇవే..

థియేటర్లలో ప్యాకేజ్‌ ఫుడ్‌ మాత్రమే అనుమతించాలి.. ఓపెన్ ఫుడ్ తింటే దాని నుంచి కూడా కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి..

కరోనా ప్రస్తుతం వాల్డ్ వైడ్‌గా ఎవరు ఊహాలకు అందని రీతిలో అందరినీ చావు దెబ్బ తీస్తోంది. లాక్‌డౌన్ తర్వాత సినిమా థియేటర్స్‌లో ఈ మార్పులు చేయనున్నట్టు సమాచారం.

 • Share this:
  కరోనా ప్రస్తుతం వాల్డ్ వైడ్‌గా ఎవరు ఊహాలకు అందని రీతిలో అందరినీ చావు దెబ్బ తీస్తోంది. కరోనా ఎఫెక్ట్ దేశంలోని దాదాపు అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.  ఈ వైరస్ ఇపుడు మన దేశంతో పాటు ప్రపంచ దేశాలను సైతం వణికిస్తోంది. మన దేశంలో కరోనా ఎఫెక్ట్‌తో వందల మంది కన్నుమూసారు. రోజు రోజుకు మన దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ కట్టడికి మన కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే తెలంగాణ, ఒడిషా సహా  కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఈ నెల 30 వరకు లాక్‌డౌన్ ప్రకటించాయి. రేపు ఈ లాక్‌డౌన్ పై ప్రధాన మంత్రి ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే కరోనా ఎఫెక్ట్‌తో టాలీవుడ్, బాలీవుడ్ అనే కాదు..  అన్ని ఇండస్ట్రీస్‌కు సంబంధించిన పెద్ద సినిమాలు రీ షెడ్యూల్ చేయాల్సి వస్తోంది. థియేటర్స్, మాల్స్,మల్టీప్లెక్స్ అన్ని బంద్ అయ్యాయి.

  కరోనా దెబ్బకు థియేటర్స్ ఖాళీ


  ఈ నెల 30 తర్వాత లాక్‌డౌన్ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఐతే.. లాక్‌డౌన్ తర్వాత థియేటర్స్ ఓపెన్ అవుతాయా లేదా అనే విషయంలో ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇప్పటికే కరోనా ఎఫెక్ట్ కారణంగా మన దేశంలోని అన్ని చిత్రపరిశ్రమలు దాదాపు రూ. 3 వేల కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు అంచనా.  ఒక్క టాలీవుడ్ చిత్ర పరిశ్రమనే రూ. 800 కోట్ల మేర నష్టాలను చవిచూసినట్టు సమాచారం. గత 50ఏళ్లలో చిత్ర పరిశ్రమ ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎపుడు చూడలేదు. కేవలం ఇది మన దేశానికి చెందిన చిత్ర పరిశ్రమకే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అన్ని చిత్ర పరిశ్రమలకు ఈ ఎఫెక్ట్ భారీగా ఉంది.

  corona virus effect on film industry box office collections nil,corona virus effect,corona virus effect no public in cinema halls,corona effcect no public in roads,prabhas,corona virus effect bahubali fame prabhas wearing mask,prabhas corona virus effect,prabhas airport,
  మల్టీప్లెక్స్ (ప్రతీకాత్మక చిత్రం)


  కరోనా ఎఫెక్ట్ తగ్గిన తరువాత ప్రజలు తమ ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారనే వాదన ఇప్పటికే వినిపిస్తోంది. అదే నిజమైతే... నిత్యవసరం కానీ సినిమాలపై మూవీ లవర్స్ ఎంత మేరకు డబ్బు ఖర్చు చేస్తారనేది కూడా సందేహంగా మారింది. కరోనా పోయినా... ఆ భయం కారణంగా ప్రేక్షకులు కొన్నేళ్ల పాటు ధియేటర్లకు దూరంగా ఉండే అవకాశం లేకపోలేదు. సినీ నిర్మాతలు కూడా ఇదే రకమైన అంచనాతో ఉన్నారు.సినిమా కలెక్షన్లపై కరోనా ప్రభావం ఏ రకంగా ఉంటుందనే విషయం రెండు మూడు పెద్ద సినిమాలు విడుదలైతే కానీ తెలియదు. లాక్‌డౌన్ తర్వాత  ప్రజలు థియేటర్స్ వైపు రావడానికి మల్టీప్లెక్స్ యాజామాన్యం సీట్ల తగ్గించి మనిషికి మనిషికి మధ్య మూడు సీట్లు గ్యాప్ ఉండేలా సిటింగ్ సిస్టమ్ మార్చనున్నట్లు సమాచారం. మాములు సింగిల్ థియేటర్స్ యాజమాన్యం వాళ్లు  కేవలం 50 శాతం టికెట్లు మాత్రమే అమ్మాలనే కొత్త నిబంధనను అనుసరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలో సీట్ల సంఖ్యను తగ్గించి టికెట్ రేట్లు పెంచితే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు నష్టాల ఊబిలో కూరుకుపోయిన థియేటర్స్ నడుపుకోలేని పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. మొత్తానికి చిత్ర పరిశ్రమకు కరోనా పెద్ద దెబ్బే వేసిందని చెప్పాలి.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: