అక్కడ లక్షల్లో చనిపోతారట.. కరోనాను ఆపకపోతే 33 లక్షల మంది బలి

ప్రజలు మాస్క్‌లు ధరించి, సామాజిక దూరం పాటించినా.. కనీసం 12.2 కోట్ల మంది కరోనా బారినపడతారని యూఎస్ ఫైనాన్స్ కమిషన్ తెలిపింది.

news18-telugu
Updated: April 17, 2020, 7:23 PM IST
అక్కడ లక్షల్లో చనిపోతారట.. కరోనాను ఆపకపోతే 33 లక్షల మంది బలి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని కబళిస్తోంది. కోవిడ్ మహమ్మారి దెబ్బకు అమెరికా, యూరప్ దేశాల్లో జనం పిట్టల్లా రాలుతున్నారు. ఐతే ఆఫ్రికా ఖండంలో మాత్రం పరిస్థితి అదుపులోనే ఉంది. మిగతా దేశాలతో పోల్చితే ఆఫ్రికా దేశాల్లో తక్కువ సంఖ్యలోనే కేసులు నమోదవుతున్నాయి. ఐతే అప్పుడే సంబరపడవద్దని.. ముందుంది మొసళ్లు పండగంటూ ఐక్యరాజ్య సమితి ఆర్థిక కమిషన్ హెచ్చరిస్తోంది. కరోనాను ఎంత కట్టడి చేసినా ఆఫ్రికా దేశాల్లో ఈ ఏడాది కనీసం 3 లక్షల మంది చనిపోతారని అంచనా వేసింది. కరోనాను పట్టించుకోకుండా నియంత్రణ చర్యలు చేపట్టకపోతే పరిస్థితి ఊహించనంత భయానకంగా ఉంటుందని తెలిపింది. ఏకంగా 120 కోట్ల మందికి వైరస్ సోకుతుందని.. 33 లక్షల మంది చనిపోవచ్చని హెచ్చరించింది.

కరోనా నియంత్రణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నా.. ప్రజలు మాస్క్‌లు ధరించి, సామాజిక దూరం పాటించినా.. కనీసం 12.2 కోట్ల మంది కరోనా బారినపడతారని యూఎస్ ఫైనాన్స్ కమిషన్ తెలిపింది. ఇంపీరియల్ కాలేజ్ లండన్ మోడల్ ఆధారంగా ఈ నివేదికను విడుదల చేసింది. టెస్ట్‌లు, డాక్టర్లకు పీపీఈ సూట్లు, చికిత్స కోసం 44 బిలియన్ డాలర్లు అవసరమవుతాయని.. అదే పరిస్థితి అదుపు తప్పితే మాత్రం 446 బిలియన్ డాలర్లు అవసరమవుతాయని అంచనావేసింది. ఆఫ్రికాలో పేదరికం, సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం, నగరాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయా దేశాలపై కరోనా పంజా విసిరే ప్రమాదముందని హెచ్చరించింది.

ఇప్పటి వరకు ఆఫ్రికా వ్యాప్తంగా 18వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐతే యూరప్, అమెరికాతో పోల్చితే ఆఫ్రికా కొన్ని వారాలు మాత్రమే వెనక ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. రాబోయే మూడు, నాలుగు వారాల్లో ఆఫ్రికాలో కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తుందని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాలు చర్యలు తీసుకొని.. కరోనా కట్టడికి ప్రయత్నించినా.. పెద్ద మొత్తంలో మరణాలు తప్పవని అంటున్నారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా 22,06,439 మందికి కరోనా వైరస్ సోకగా.. ఇప్పటి వరకు 5,58,437 మంది కోలుకున్నారు. కరోనాతో పోరాడి 1,48,651 మంది చనిపోయారు. అమెరికాలో 34,641, ఇటలీలో 22,170, స్పెయిన్లో 19,315, యూకేలో 14,576 మంది మరణించారు.
First published: April 17, 2020, 7:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading