కరోనాతో ఆఫ్రికాలో 3 లక్షల మంది మృతి చెందే చాన్స్...సంచలన నివేదిక...

ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టకపోతే 33 లక్షల మంది చనిపోతారని, 120 కోట్ల మందికి వైరస్ సోకే ప్రమాదం ఉందని ఆఫ్రికాపై ఐక్యరాజ్య సమితి ఆర్థిక కమిషన్ రూపొందించిన నివేదిక పేర్కొంది.

news18-telugu
Updated: April 18, 2020, 8:42 AM IST
కరోనాతో ఆఫ్రికాలో 3 లక్షల మంది మృతి చెందే చాన్స్...సంచలన నివేదిక...
ప్రతకాత్మకచిత్రం
  • Share this:
ఆఫ్రికాలో కరోనా వైరస్ కారణంగా కనీసం 3 లక్షల మంది ప్రాణాలు కోల్పోతారని యూఎన్ హెల్త్ ఏజెన్సీ ఓ నివేదిక వెలువరించింది. ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టకపోతే 33 లక్షల మంది చనిపోతారని, 120 కోట్ల మందికి వైరస్ సోకే ప్రమాదం ఉందని ఆఫ్రికాపై ఐక్యరాజ్య సమితి ఆర్థిక కమిషన్ రూపొందించిన నివేదిక పేర్కొంది. ఆఫ్రికాలో ప్రస్తుతం 18,000 కరోనా కేసుల నమోదైనాయి. యూరప్ తరహాలో ఇక్కడ వైరస్ విజృంభించే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కఠినంగా వ్యక్తిగత దూరం పాటిస్తే అత్యుత్తమ పరిస్థితుల్లో సైతం12.2 కోట్ల మందికి వైరస్ సోకే ప్రమాదం ఉందని ఆ నివేదిక అంచనా వేసింది. అత్యుత్తమ వైద్య సదుపాయాలు లేని ఆఫ్రికాలో ఏది జరిగినా కష్టమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగాఆఫ్రికా ఖండంలో వృద్ధి రేటు 2.6 శాతానికి పడిపోయే ప్రమాదం ఉందని, 2.7 కోట్ల మంది దుర్భర దారిద్య్రంలోకి కూరుకుపోతారని ప్రసంచ బ్యాంకు అంటోంది. కరోనా కారణంగా ఎదురయ్యే నష్టాలను తట్టుకునే ఆర్థిక స్థితి ఆఫ్రికాలోని ఏ దేశానికీ లేదని, దాదాపు అన్ని దేశాలు కూడా రెండేళ్ల పాటు అప్పుల్లోనే కూరుకుపోయి ఉంటాయని ఐరాస నివేదిక పేర్కొంది.
First published: April 18, 2020, 8:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading