కరోనా వ్యాక్సిన్ ఇంజెక్షన్ అంటే భయపడుతున్నారా?.. అలాంటి వారికి గుడ్ న్యూస్..

కరోనా వ్యాక్సిన్ ఇంజెక్షన్ అంటే భయపడుతున్నారా?.. అలాంటి వారికి గుడ్ న్యూస్..

ఫ్రతీకాత్మక చిత్రం

CoronaVaccine Pill: ఇంజక్షన్​ అంటే బయపడే వారు వ్యాక్సిన్​ జోలికి వెల్లడం లేదు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాన్ని కనిపెట్టింది లాస్ ఏంజిల్స్​లోని లేకర్స్​ అనే బయోటెక్​ సంస్థ. వ్యాక్సిన్​​ అంటే బయపడేవాళ్లకి గుడ్​ న్యూస్​ తెలిపింది.

  • Share this:
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్​ సృష్టించిన విలయతాండవం అంతా ఇంతా కాదు. కంటికి కనిపించని ఈ వైరస్​తో ప్రపంచం గడగడలాడి పోతుంది. కరోనా ప్రారంభం నుంచి మాస్క్​, శానిటైజర్​, సోషల్​ డిస్టన్స్​, లాక్​డౌన్ ఇలా ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఏడాది నుంచి కరోనా ఉదృతి ఏ మాత్రం తగ్గలేదు. దీనితో, వ్యాక్సిన్​ మాత్రమే కరోనాకు చెక్​ పెట్టగలదని అందరూ భావించారు.. ఎట్టకేలకు వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చి, విజయవంతంగా వ్యాక్సినేషన్​ డ్రైవ్​ కొనసాగుతోంది. అయితే, ప్రస్తుత విధానంలో సూదుల ద్వారా ఇంజెక్షన్​ ఇచ్చి వ్యాక్సిన్​ను బాడీలోకి పంపిస్తున్నారు. ఈ ప్రక్రియతో కొంత మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంజక్షన్​ అంటే బయపడే వారు వ్యాక్సిన్​ జోలికి వెల్లడం లేదు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాన్ని కనిపెట్టింది లాస్ ఏంజిల్స్​లోని లేకర్స్​ అనే బయోటెక్​ సంస్థ. వ్యాక్సిన్​​ అంటే బయపడేవాళ్లకి గుడ్​ న్యూస్​ తెలిపింది.

వ్యాక్సిన్​ ని ఇన్​జెక్షన్​ రూపంలోనే కాకుండా టాబ్లెట్​ రూపంలో కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీనిపై సూన్-షియాంగ్ ఇమ్యునిటీ బయో వ్యవస్థాపకుడు, లేకర్స్ సహ-యజమాని డాక్టర్​ పాట్రిక్స్​తో సహా మరికొందరు సైంటిస్తులు కాలిఫోర్నియా ఎల్ సెగుండోలోని ఒక పరిశోధనా కేంద్రంలో పరీక్షలు జరుపుతున్నారు. అయితే, ఇన్​జెక్షన్​ ద్వారా ఇచ్చే వ్యాక్సిన్​తో పోలిస్తే టాబ్లెట్ల రూపంలో ఇచ్చే వ్యాక్సిన్​ తప్పకుండా మెరుగైన ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నట్లు పరిశోధకులు పేర్కొంటున్నారు.

సులభంగా నిర్వహించవచ్చు..
ప్రస్తుతం వ్యాక్సిన్​కు కోల్డ్​ స్టోరేజీ పెద్ద సమస్యగా మారింది. దీన్ని నిర్ధిష్ట ఉష్ణోగ్రత వద్దనే స్టోర్​ చేయాల్సి ఉంటుంది. కానీ, కరోనా టాబ్లెట్లు అందుబాటులోకి వస్తే ఈ సమస్య తీరనుందని పరిశోధకులు చెబుతున్నారు. దీన్ని ప్రస్తుతం, ఆరోగ్యకరమైన వాలంటీర్లపై ప్రయోగిస్తున్నారు. వారిలో మెరుగైన ఫలితాలొస్తే త్వరలోనే బహిరంగ మార్కెట్లోకి ప్రవేశపెడతామని అంటున్నారు. కాగా, కరోనా టాబ్లెట్ల కోసం పరిశోధకులు నాలుగు వేర్వేరు విధానాలను పరీక్షిస్తున్నారు. కరోనా సోకని 55 ఏళ్లలోపు ఆరోగ్యకరమైన వాలంటీర్లపై ప్రయోగాలు చేస్తున్నారు. వారికి ఒక రౌండ్​ ఇంజెక్షన్, రెండు రౌండ్ల టాబ్లెట్స్​ ఇచ్చి పరిశోధన జరుపుతున్నట్లు తెలిపారు.

ఇంజెక్షన్​, టాబ్లెట్​కు మధ్య తేడా..
కరోనాకు విరుగుడుగా చెప్పుకుంటున్న ఈ రెండు రకాల వ్యాక్సిన్​లు దేనికదే ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయి. అయితే, మనిషిలో యాంటీ బాడీలు త్వరగా వృద్ధి చెందడానికి ప్రస్తుతం ఇస్తున్న ఇన్​జెక్షన్​ టీకాలు బాగా సహాయపడతాయి. వీటి ద్వారా మ్యుటేషన్‌కు తక్కువ అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికాలో అత్యవసర వినియోగం కోసం ప్రస్తుతం ఉపయోగిస్తున్న - ఫైజర్- బయో ఎంటెక్, మోడెర్నా, జాన్సన్ & జాన్సన్ వంటి మూడు వ్యాక్సిన్లు కరోనాను కట్టడి చేయడానికి, యాంటీ బాడీలను సృష్టించడానికి బాగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. అయితే, టాబ్లెట్ల రూపంలో వచ్చే వ్యాక్సిన్​ మాత్రం వైరస్​ చూట్టూ ఉన్న కణాలపై అటాక్​ చేసి "కిల్లర్ టి కణాలను" ఉత్పత్తి చేస్తుందని.. తద్వారా వైరస్​ మ్యుటేషన్‌కు తక్కువ అవకాశం ఉందని డాక్టర్ సూన్-షియాంగ్ వివరించారు.

వేగంగా, చౌకగా..
క్యాప్సూల్ రూపంలో టీకా అందుబాటులోకి వస్తే అనేక ప్రయోజనాలు కలుగనున్నాయి. బహిరంగ మార్కెట్​లో దీని ఉపయోగం కోసం ఎఫ్‌డిఎ ఆమోదం లభించినట్లైతే.. తక్కువ ధరకే లభించనుంది. అంతేకాక, ఇది కరోనా కట్టడికి వేగంగా పనిచేయనుంది. ఎందుకంటే, కరోనా టాబ్లెట్లను రిఫ్రిజిరేటర్ లేదా గడ్డకట్టే ఉష్ణోగ్రతలలో నిల్వ చేయవలసిన అవసరం లేదు. అయితే, క్యాప్సూల్స్ అందుబాటులోకి వచ్చినప్పటికీ.. ఇంజెక్షన్ల ద్వారా ఇచ్చే వ్యాక్సిన్​ కూడా ముఖ్యమేనని.. ఈ రెండూ కలిసి పనిచేయడం చాలా అవసరమని పరిశోధకులు అభిప్రయపడుతున్నారు. అయితే, ఈ టాబ్లెట్లు ప్రస్తుతం ప్రయోగ దశలలో మాత్రమే ఉన్నాయి. బహిరంగ మార్కెట్​లోకి అందుబాటులోకి రావడానికి మరో 12 నెలల సమయం పట్టే అవకాశం ఉంది.
First published:

అగ్ర కథనాలు