ఆదిలాబాద్ రిమ్స్‌లో నర్సుకు కరోనా... సిబ్బందిలో కలవరం..

(ప్రతీకాత్మక చిత్రం)

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ లో పనిచేస్తున్న ఓ స్టాఫ్ నర్స్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

  • Share this:
    ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ లో పనిచేస్తున్న ఓ స్టాఫ్ నర్స్ కు కరోనా పాజిటివ్ తేలడంతో వైద్య సిబ్బందిలో కలవరం మొదలయింది. పాజిటివ్ తేలిన స్టాఫ్ నర్స్ సన్నిహితంగా మెదిలిన వైద్యులు, వైద్య సిబ్బంది మొత్తం 28 మందిని గుర్తించి వారంరోజుల హోంక్వారంటైన్ లో ఉంచారు. మరో వైపు జిల్లా కేంద్రంలోని పాజిటివ్ తేలిన వ్యక్తుల నివాస ప్రాంతాల్లో 100 మీటర్ల వరకు కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించి భారీ కేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలను కట్టడి చేశారు. మరోవైపు రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ముందు జాగ్రత్తగా జిల్లా కేంద్రంలో జూలై 15 వరకు దుకాణాలు, ఇతర వాణిజ్య సంస్థలను ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయించింది.
    First published: