రాజకీయ నేతలపై ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు...

బలరాం నాయక్, ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ డైరెక్టర్ డా. బలరాం నాయక్ స్థానిక రాజకీయ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Share this:
    ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ డైరెక్టర్ డా. బలరాం నాయక్ స్థానిక రాజకీయ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రిమ్స్ లో ఖాళీల భర్తీని స్థానిక నాయకులు చేయొద్దంటున్నారని అన్నారు. ఖాళీలు భర్తీ చేయకుండానే రిమ్స్ లో సౌకర్యాలు ఉన్న దాంట్లో వందశాతం పనిచేస్తున్నామని పేర్కొన్నారు. కొంతమంది వైద్యుల పోస్టులకోసం రాజకీయ నేతలు రిక్రూట్మెంట్ ఆపేయమంటున్నారు ఆరోపించారు. ఇదే విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లామని చెప్పారు. ఇదిలా ఉంటే రిమ్స్ లోని ఐసోలేషన్ వార్డు నుంచి పది మంది పారిపోయారు. సిబ్బంది అత్యవసర విభాగం విధుల్లో ఉండగా వీరు తప్పించుకున్నట్లు సమాచారం. వీరిలో ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. ఇందులో ఆరుగురికి కరోనా పాజిటివ్ కాగా నలుగురు అనుమానితులు ఉన్నారు. వారి సెల్ ఫోన్ నెంబర్ల ఆధారంగా వారిని గుర్తించి పనిలో అధికారు ఉన్నారు.

    అయితే ఆసుపత్రి నుంచి ఎవరు పారిపోలేదని, ముగ్గురు పండుగ ఉందని ఇంటికి వెళ్ళి వచ్చారని రిమ్స్ డైరెక్టర్ పేర్కొనడం విశేషం.అయితే రిమ్స్ నుంచి బాధితులు పారిపోయిన ఘటనపై జిల్లా కలెక్టర్ నలుగురు సభ్యులతో విచారణకు కమిటీ వేశారు. రిమ్స్ వ్యవహారం ఎటు నుంచి ఎటు మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: