Adilabad: ప్లీజ్ సార్.. వాళ్లను మాత్రం ‘వదిలిపెట్టొద్దు’ సార్ అంటున్న జనం

Adilabad: ప్లీజ్ సార్.. వాళ్లను మాత్రం ‘వదిలిపెట్టొద్దు’ సార్ అంటున్న జనం

ప్రతీకాత్మక చిత్రం

ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్, బేల, భీంపూర్ మండలాల నుండి చంద్రపూర్, యవత్మాల్, నాగ్ పూర్ ప్రాంతాలకు, బోథ్ ప్రాంతానికి మహారాష్ట్రలోని కిన్వట్, నిర్మల్ జిల్లా బాసర, భైంసా నుండి మహారాష్ట్రలోని ధర్మాబాద్, భోకర్, నాందేడ్ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు.

 • Share this:
  (కట్టా లెనిన్, ఆదిలాబాద్ కరస్పాండెంట్, న్యూస్ 18)

  మహారాష్ట్రలో రోజురోజుకు కరోనా విజృంభిస్తుండటంతో సరిహద్దులో ఉన్న తెలంగాణాలోని గ్రామాల్లో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కేసుల్లో ముందువరసలో ఉన్న ఆ రాష్ట్రంలోని జిల్లా ఆదిలాబాద్ జిల్లాకు సరిహద్దున ఉండటం మరింత భయాందోళనను కలిగిస్తోంది. మహరాష్ట్రకు సరిహద్దున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చాలా గ్రామాలు ఉన్నాయి. వివిధ అవసరాల కోసం నిత్యం ప్రజలు అటు ఇటు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఎలాంటి ముందస్తు పరీక్షలు నిర్వహించకుండానే రాకపోకలు సాగిస్తున్నారని, తద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని స్థానికులు వాపోతున్నారు. పరీక్షలు నిర్వహించిన తర్వాతే జిల్లాలోకి అనుమతించాలని కోరుతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాకు సరిహద్దున ఉన్న మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో ఆ ప్రాంతాని సరిహద్దున్ ఉన్న ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్, బేల, భీంపూర్ మండలాల్లో సరిహద్దు గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రం నుండి కూడా రాకపోకలు సాగిస్తుండటంతో పట్టణ వాసులు కూడా భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

  ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్, బేల, భీంపూర్ మండలాల నుండి చంద్రపూర్, యవత్మాల్, నాగ్ పూర్ ప్రాంతాలకు, బోథ్ ప్రాంతానికి మహారాష్ట్రలోని కిన్వట్, నిర్మల్ జిల్లా బాసర, భైంసా నుండి మహారాష్ట్రలోని ధర్మాబాద్, భోకర్, నాందేడ్ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. అలాగే మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల నుండి చంద్రపూర్, గడ్చిరోలి ప్రాంతాలతో సంబంధాలు ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలో కరోనా మరోసారి విజృంభిస్తుండటంతో మహారాష్ట్ర అంటేనే ఇక్కడి ప్రజలు జంకుతున్నారు. ఈ పరిస్థితుల్లో సరిహద్దుల్లో రాకపోకలను కట్టడి చేయాలని, తగు పరీక్షలు నిర్వహించి వైరస్ వ్యాప్తిని అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. మరోవైపు అప్రమత్తమైన అధికార యంత్రాంగం కూడా రాకపోకలపై దృష్టి సారించి అవసరమైన చర్యలకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ కూడా పరీక్షలు నిర్వహించడానికి సిద్దమైంది. అదే సమయంలో జిల్లా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది.
  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  అగ్ర కథనాలు