కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడి సినీనటి, మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆమెకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు నాగ్‌పూర్ నుంచి ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేకు ఆమె అభిమాని ఒకరు రక్తంతో లేఖ రాశారు. దీంతో ఆయన నవనీత్ కౌర్ అంశంపై ఫోకస్ చేశారు. ఆమెకు మరింత మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఆమెను నాగ్‌పూర్ నుంచి ముంబైకు తరలించారు. ఆమె తీవ్రమైన ఛాతి నొప్పితో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు.
తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లో నటించిన నవనీత్ కౌర్.. 2019లో స్వతంత్ర్య ఎంపీగా విజయం సాధించారు. కొద్దిరోజుల క్రితం ఆమెకు కరోనా సోకింది. దీంతో ఆమె అమరావతిలోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఆరు రోజులు అక్కడే చికిత్స పొందారు. అయితే హఠాత్తుగా ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆమెను వెంటనే నాగ్‌పూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో ముంబైలోని లీలావరి ఆస్పత్రికి తరలించారు. కొద్ది రోజుల క్రితం నవనీత్ కౌర్‌తో పాటు ఎమ్మెల్యే అయిన ఆమె భర్త రవి రానాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. వారితో పాటు వారి కుటుంబంలోని మొత్తం 11 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో వీరి పిల్లలు కూడా ఉన్నారు. తనకు కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో... తనను కలిసిన వారంతా కోవిడ్ 19 పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus