కమల్ హాసన్‌కు కరోనా అంటూ తప్పుడు ప్రచారం..

Kamal Haasan: కమల్ హాసన్‌కు కరోనా లక్షణాలు కనిపించాయని.. ఆయన ఇంటి బయట కూడా దానికి సంబంధించిన నోటీస్ ఉందంటూ కొందరు ప్రచారం చేసారు. ఆయన ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 28, 2020, 12:35 PM IST
కమల్ హాసన్‌కు కరోనా అంటూ తప్పుడు ప్రచారం..
కమల్‌ హాసన్ (Twitter/Photo)
  • Share this:
కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తుంది. చిన్నా పెద్దా.. పెద్దోడు పేదోడు అనే తేడా లేకుండా అందర్నీ కాటేస్తుంది. బ్రిటన్‌లో అయితే ఏకంగా ప్రధానితో పాటు ఇంకా చాలా మందికి వచ్చేసింది. అమెరికాలో కూడా అదే పరిస్థితి. ఇండియాలో కూడా కరోనా కాటుకు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే కమల్ హాసన్‌కు కరోనా లక్షణాలు కనిపించాయని.. ఆయన ఇంటి బయట కూడా దానికి సంబంధించిన నోటీస్ ఉందంటూ కొందరు ప్రచారం చేసారు. ఆయన ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు పూర్తిగా సెల్ఫ్ క్వారెంటైన్ చేసుకున్నాడని వార్తలొచ్చాయి.

కమల్ హాసన్ (twitter/Photo)
కమల్ హాసన్ (twitter/Photo)


చెన్నైలోని అల్వార్ పేట్‌లోని ఆయన ఇంట్లోనే ప్రస్తుతం కమల్ బయటికి రాకుండా ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకున్న వేళ.. ఆయన సీరియస్ అయ్యాడు. ఓ ప్రెస్ నోట్ విడుదల చేసి అందరికి క్లారిటీ ఇచ్చాడు. తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని.. పోలీసులు, ప్రభుత్వం చెప్పినట్లుగానే తాను సోషల్ డిస్టైన్సింగ్ మెయింటేన్ చేస్తున్నట్లు చెప్పాడు లోక నాయకుడు.

కమల్ హాసన్ విడుదల చేసిన లెటర్ (Kamal Haasan)
కమల్ హాసన్ విడుదల చేసిన లెటర్ (Kamal Haasan)


తన ఇంటి బయట అతికించిన కొన్ని పోస్టర్స్ చూసి అలా అనుకున్నారేమో కానీ కొన్నేళ్లుగా తాను అక్కడ లేనన్న సంగతి అందరికీ తెలుసు అంటున్నాడు కమల్. తనకు ఎలాంటి అనారోగ్యం లేదని.. లేనిపోని పుకార్లు సృష్టించి అనవసరంగా అభిమానులను కంగారు పెట్టొద్దని కోరాడు కమల్. అంతేకాదు.. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని.. ఒకవేళ బయటికి వచ్చినా కూడా సోషల్ డిస్టేన్సింగ్ మెయింటేన్ చేయాలని కోరాడు. ఏదైనా వార్త రాసేముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని రాయాలంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు కమల్ హాసన్.
Published by: Praveen Kumar Vadla
First published: March 28, 2020, 12:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading