Covid Update : రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని కరోనా వైరస్(Corona Virus)పట్టిపీడిస్తోంది. ఇప్పటికీ ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగానే ఉంటున్న విషయం తెలిసిందే. అయితే భారత్(India) లో మాత్రం కరోనా కేసులు(Corona Cases)తగ్గిపోతున్నాయి. గురువారం నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా కొత్తగా 3947 కరోనా వైరస్ కేసులు,9మరణాలు(Covid Deaths)నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. కొత్తగా నమోదన కేసుల్లో అత్యధికంగా 1445 కేసులు కేరళలోనే ఉన్నాయి. తమిళనాడులో 531, మహారాష్ట్ర 453, పశ్చిమబెంగాల్ 284, కర్ణాటకలో 266 మంది కరోనా బారినపడ్డారు.
ఇక,తాజా కేసులు,మరణాలతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,45,87,307కు,మొత్తం మరణాల సంఖ్య 5,28,629కు చేరింది. దేశంలో గడిచిన 24 గంటల్లో 5,096 కోవిడ్ నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య4,40,19,095కి చేరుకుంది.
ట్రాఫిక్ కష్టాలకు చెక్..బెంగుళూరులో హెలికాఫ్టర్ రైడ్ సర్వీసులు ప్రారంభం!
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.