హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Covid Update : హమ్మయ్యా..రోజురోజుకి తగ్గిపోతున్న యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య

Covid Update : హమ్మయ్యా..రోజురోజుకి తగ్గిపోతున్న యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Active Covid cases in country : రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని కరోనా వైరస్(Corona Virus)పట్టిపీడిస్తోంది. ఇప్పటికీ ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగానే ఉంటున్న విషయం తెలిసిందే.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Active Covid cases in country : రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని కరోనా వైరస్(Corona Virus)పట్టిపీడిస్తోంది. ఇప్పటికీ ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగానే ఉంటున్న విషయం తెలిసిందే. అయితే భారత్(India) లో మాత్రం కరోనా కేసులు(Corona Cases)తగ్గిపోతున్నాయి. శనివారం నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా కొత్తగా 2756 కరోనా వైరస్ కేసులు,21మరణాలు(Covid Deaths)నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. అయితే శనివారంతో పోల్చితే కోవిడ్ కేసుల సంఖ్య స్పలంగా తగ్గింది. శనివారం 2797 కరోనా వైరస్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజా కేసులు,మరణాలతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,46,12,013కు,మొత్తం మరణాల సంఖ్య 5,28,779కు చేరింది. గడిచిన 24 గంటల్లో నమోదైన మొత్తం 21 మరణాల్లో..16మంది కేరళలోనే మృతి చెందారు. ఇక,దేశవ్యాప్తంగా డైలీ పాజిటివిటీ రేటు 1.15శాతంగా,వీక్లీ పాజిటివిటీ రేటు 1.28శాతంగా ఉంది.

దేశంలో గడిచిన 24 గంటల్లో 3393 మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,40,54,621కు చేరుకుంది. రికవరీ రేటు 98.75శాతంగా ఉంది. శనివారం దేశంలో 2,39,546మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా..ఇప్పటివరకు 89.69కోట్ల మందికి కోవిడ్ టెస్ట్ లు నిర్వహించారు.

Bharat Jodo Yatra : భారత్ జోడో యాత్రకు 30 రోజులు..జోరు వర్షంలోనూ తగ్గని రాహుల్ హుషారు

దేశంలో ప్రస్తుతం 28,593 యాక్టివ్‌ కోవిడ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో 0.O6 శాతం కేసులు యాక్టివ్‌ గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక,దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. దేశంలో శనివారం 4,73,682మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 218.97 కోట్లకు చేరింది.

First published:

Tags: Corona deaths, Corona positive cases, Covid cases, Covid-19

ఉత్తమ కథలు