తెలంగాణ బాటలో ఏపీ ప్రభుత్వం.. వారిపై చర్యలకు రంగం సిద్ధం

త్వరలోనే అధికంగా ఫిర్యాదులు వచ్చిన ఆస్పత్రులపై చర్యలు తీసుకునేందుకు జగన్ సర్కార్ సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: August 13, 2020, 3:50 PM IST
తెలంగాణ బాటలో ఏపీ ప్రభుత్వం.. వారిపై చర్యలకు రంగం సిద్ధం
సీఎం జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
కరోనా కష్టకాలంలో రోగుల నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తూ వారి వేధిస్తున్న ఆస్పత్రులపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. కరోనా చికిత్సకు ప్రభుత్వం నిర్దేశించిన ధరలు కాకుండా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని సర్కార్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే రూల్స్‌కు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తున్న ఆస్పత్రుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తయారు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ఘటన తరువాత అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం... ఆస్పత్రుల్లో భద్రతా ప్రమాణాలతో పాటు ఆయా ఆస్పత్రులు వసూలు చేస్తున్న చికిత్స ఫీజులపై కూడా ఫోకస్ చేసింది.

త్వరలోనే అధికంగా ఫిర్యాదులు వచ్చిన ఆస్పత్రులపై చర్యలు తీసుకునేందుకు జగన్ సర్కార్ సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కరోనా చికిత్స కోసం రోగుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేసిన పలు ప్రైవేటు ఆస్పత్రులపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వాటిలో కరోనా చికిత్సను నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫిర్యాదులు వచ్చిన మరికొన్ని ఆస్పత్రులపై కూడా ఇదే రకమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణ తరహాలోనే ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.
Published by: Kishore Akkaladevi
First published: August 13, 2020, 3:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading