రూ.9,999 ధరకే కంప్యూటర్... వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి మంచి ఆఫర్

Acer Veriton N Series PC | తక్కువ ధరలో కంప్యూటర్ కొనాలనుకుంటున్నారా? ఏసర్ నుంచి రూ.9,999 ధరకే పీసీ రిలీజ్ అయింది. వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: June 17, 2020, 2:28 PM IST
రూ.9,999 ధరకే కంప్యూటర్... వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి మంచి ఆఫర్
రూ.9,999 ధరకే కంప్యూటర్... వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి మంచి ఆఫర్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఇంటి నుంచే ఎక్కువగా పనిచేయాల్సి వస్తుందా? వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం తక్కువ బడ్జెట్‌లో కంప్యూటర్ కొనాలనుకుంటున్నారా? గ్లోబల్ పీసీ బ్రాండ్ ఏసర్ తక్కువ ధరకే కంప్యూటర్‌ను ఆవిష్కరించింది. ఏసర్ వెరిటాన్ ఎన్ సిరీస్ బిజినెస్ పీసీలను పరిచయం చేసింది. 4జీబీ ర్యామ్, ఇంటెల్ డ్యూయల్ కోర్ లేదా క్వాడ్ కోర్ ప్రాసెసర్‌, మైక్రోసాఫ్ట్ విండోస్ 10 తో పనిచేసే ఈ కంప్యూటర్ ధర రూ.9,999 మాత్రమే. యూజర్లు ర్యామ్, ప్రాసెసర్ పెంచుకోవచ్చు. ప్రొడక్టివిటీ పెంచేందుకు రెండు డిస్‌ప్లేలను కూడా సపోర్ట్ చేస్తుంది. 6 యూఎస్‌బీ పోర్టులు ఉంటాయి. వాటిలో రెండు యూఎస్‌బీ 3.1 జెన్ 1 పోర్టులు ఉంటాయి. వీటి ద్వారా డేటాను హైస్పీడ్‌తో ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.

ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నవారిని దృష్టిలో పెట్టుకొని ఏసర్ ఈ సరికొత్త పీసీని ఆవిష్కరించింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులు మాత్రమే కాదు ఆన్‌లైన్ క్లాసులు వినే విద్యార్థులకు, విద్యా సంస్థలకు, వ్యాపారులకు తక్కువ ధరలో లభించే ఈ పీసీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏసర్ ఇండియా వెబ్‌సైట్‌తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా ఏసర్ వెరిటాన్ ఎన్ సిరీస్ పీసీలను కొనచ్చు.

ఇవి కూడా చదవండి:

Samsung Galaxy A21s: ఇండియాలో రిలీజ్ అయిన సాంసంగ్ గెలాక్సీ ఏ21ఎస్... ధర ఎంతంటే

Nokia 5310: నోకియా నుంచి మరో ఫీచర్ ఫోన్... ధర రూ.3,399 మాత్రమే

Motorola: అదిరిపోయే ఫీచర్స్‌తో 'మోటోరోలా వన్ ఫ్యూజన్+' రిలీజ్... ధర తెలిస్తే షాకే
Published by: Santhosh Kumar S
First published: June 17, 2020, 2:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading