ABOUT VISTA EQUITY PARTNERS AND VISTA CONSULTING GROUP BACKGROUND MK
Reliance Jio-Vista Deal: విస్టా ఈక్విటీ పార్ట్నర్స్ సంస్థ నేపథ్యం ఇదే...
ప్రతీకాత్మకచిత్రం
విస్టా ఈక్విటీ పార్ట్నర్స్ యు.ఎస్. ప్రధాన కార్యాలయంగా నడిచే అతిపెద్ద ఈక్విటీ పెట్టుబడి సంస్థ. ఇది ప్రైవేట్ ఈక్విటీ, క్రెడిట్, పబ్లిక్ ఈక్విటీ, శాశ్వత మూలధన వ్యూహాలతో సాఫ్ట్వేర్, డేటా, టెక్నాలజీ-ఎనేబుల్డ్ సంస్థలలో ప్రత్యేకంగా పెట్టుబడులు పెడుతుంది.
యూఎస్ బేస్డ్ ఈక్విటీ సంస్థ విస్టా ఈక్విటీ పార్ట్ నర్స్, జియో ప్లాట్‌ఫార్మ్స్‌లో 2.3 శాతం వాటాలను దక్కించుకునేందుకు సిద్ధంగా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఫోకస్డ్ ఫండ్ గా పేరొందిన విస్టా సుమారు రూ.11,367 కోట్ల విలువైన వాటాలను దక్కించుకోనుంది. ఈ మేరకు గడిచిన వారంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకున్న మూడో అతిపెద్ద వ్యాపార భాగస్వామ్యం కావడం ఇదే కావడం విశేషం. అయితే విస్టా ఈక్విటీ పార్ట్స్, విస్టా కన్సల్టింగ్ గ్రూప్ నేపధ్యం విషయానికి వస్తే... విస్టా ఈక్విటీ పార్ట్నర్స్ యు.ఎస్. ప్రధాన కార్యాలయంగా నడిచే అతిపెద్ద ఈక్విటీ పెట్టుబడి సంస్థ. ఇది ప్రైవేట్ ఈక్విటీ, క్రెడిట్, పబ్లిక్ ఈక్విటీ, శాశ్వత మూలధన వ్యూహాలతో సాఫ్ట్వేర్, డేటా, టెక్నాలజీ-ఎనేబుల్డ్ సంస్థలలో ప్రత్యేకంగా పెట్టుబడులు పెడుతుంది. సుమారు 52 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ కాపిటల్ కమిట్ మెంట్స్‌తో ఈ సంస్థ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ ఫోకస్డ్ ఫండ్ నిర్వహిస్తోంది. ఈ సంస్థ కేవలం 2019లో 16 బిలియన్ల టెక్ ఫండ్ పొందింది. స్వతంత్రంగా నిర్వహించే ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సేకరించిన అతిపెద్ద సింగిల్ టెక్ ఫండ్ ఇదే కావడం విశేషం.
1. విస్టా లాంగ్ టర్మ్ ఫోకస్‌తో వేల్యూ ఆడెడ్ పెట్టుబడిదారుగా పనిచేస్తుంది. అంతేకాదు తాను పెట్టుబడి పెట్టిన సంస్థలకు వృత్తిపరమైన నైపుణ్యం, అలాగే బహుళ-స్థాయి మద్దతును అందిస్తుంది. విస్టా సంస్థకు స్వంత ప్రత్యేక కన్సల్టింగ్ వ్యవస్థ ఉంది. ఇలా స్వతంత్ర కన్సల్టింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసిన మొదటి పెట్టుబడి సంస్థలలో విస్టా ఒకటి కావడం విశేషం.
2. ఈ సంస్థను 2000 లో అమెరికన్ వ్యాపారవేత్త మరియు పెట్టుబడిదారుడు మిస్టర్ రాబర్ట్ ఎఫ్. స్మిత్ మరియు మిస్టర్ బ్రియాన్ షెత్ స్థాపించారు.
దీని పోర్ట్‌ఫోలియోలో ప్రపంచవ్యాప్తంగా 60 కి పైగా ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్, డేటా, టెక్నాలజీ ఎనేబుల్డ్ కంపెనీలను కలిగి ఉన్నాయి. సోలెరా, టిబ్కో మరియు ఇన్ఫ్లోబాక్స్ లో పెట్టుబడులు కలిగి ఉండటం విశేషం.
3. విస్టా ఇతర ప్రైవేట్ ఈక్విట్ సంస్థల కన్నా భిన్నంగా ఉంటుంది. విస్టా తన పెట్టుబడి సంస్థల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడటంలో ప్రత్యక్షంగా పాలు పంచుకుంటుంది. ఇది కేవలం ఒక PE(ప్రైవేట్ ఈక్విటీ) సంస్థ కన్నా సాఫ్ట్వేర్ కంపెనీగా ఎక్కువగా పనిచేస్తుంది. ఈ సంస్థ దాదాపు 100 ఆపరేటింగ్ విధానాల ప్లేబుక్‌ను కలిగి ఉంది, తద్వారా సంస్థ పోర్ట్‌ఫోలియో కంపెనీలలో పనితీరును మెరుగుపరచడానికి కన్సల్టింగ్ వ్యవస్థ తోడ్పడుతుంది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.