ఆరోగ్య సేతు యాప్... కరోనా వైరస్ లాక్‌డౌన్ కాలంలో ఎక్కువగా డౌన్‌లోడ్ చేసిన యాప్ ఇది. మొదటి 13 రోజుల్లో 1.5 కోట్ల మంది డౌన్‌లోడ్ చేస్తే, 41 రోజుల్లో 10 కోట్ల యూజర్లు డౌన్‌లోడ్ చేశారు. అయితే ఆరోగ్య సేతు యాప్‌పై అనేక ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఆరోగ్య సేతు యాప్ యూజర్ల ప్రైవసీ రిస్క్‌లో ఉందన్న వార్తలొచ్చాయి. దీంతో ఆరోగ్య సేతు యాప్‌లో లోపాలను గుర్తించేందుకు బగ్ బౌంటీ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది ప్రభుత్వం. ఆరోగ్య సేతు యాప్ కోడ్‌ని ఓపెన్ సోర్స్‌లోకి రిలీజ్ చేసింది. గిట్ హబ్‌లో ఆరోగ్య సేతు ఆండ్రాయిడ్ అప్లికేషన్ సోర్స్ కోడ్ ఉంది. ఇందులో లోపాలను గుర్తించేవారికి రూ.1 లక్ష వరకు బహుమతి ప్రకటించింది.
బగ్ బౌంటీ ప్రోగ్రామ్‌లో మూడు రకాల ప్రైవసీ బగ్ బౌంటీస్, ఒక కోడ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆరోగ్య సేతు యాప్‌లో బగ్స్ గుర్తించడం మాత్రమే కాదు బలహీనంగా ఉన్న కోడ్‌ను గుర్తించి ఇంప్రూవ్‌మెంట్ సూచించినవారికీ రూ.1 లక్ష వరకు బహుమతి అందించనుంది ప్రభుత్వం. ఈ ప్రయత్నం ఫలిస్తే భవిష్యత్తులో ప్రభుత్వానికి చెందిన ఇతర ప్లాట్‌ఫామ్స్‌నీ ఇలాగే చెక్ చేయిస్తామని నేషనల్ ఇన్ఫర్మెటిక్స్ కమిషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ నీతా వర్మ ప్రకటించారు.
కరోనావైరస్ పేషెంట్ల కదలికల్ని ట్రాక్ చేసేందుకు ఆరోగ్య సేతు యాప్‌ను భారత ప్రభుత్వం రూపొందించిన సంగతి తెలిసిందే. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ-MeiTY ఆధ్వర్యంలో నేషనల్ ఇన్ఫర్మెటిక్స్ సెంటర్-NIC ఈ యాప్‌ను తయారు చేసింది.
ఇవి కూడా చదవండి:
Google: 'వర్క్ ఫ్రమ్ హోమ్' ఉద్యోగులకు రూ.75,000 అలవెన్స్
SBI: బ్యాంకులో డబ్బులు దాచుకున్నవారికి ఎస్‌బీఐ షాక్
EPFO: ఈ స్టెప్స్‌తో మీ పీఎఫ్ డబ్బులు ఈజీగా విత్‌డ్రా చేయొచ్చు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aarogya Setu, Android, Corona, Corona virus, Coronavirus, Covid-19, Lockdown, Mobile App, Playstore