Home /News /coronavirus-latest-news /

AAROGYA SETU APP TEAM GIVES CLARIFICATION ON FRENCH HACKER ELLIOT ALDERSON CLAIMS ON DATA BREACH SS

Aarogya Setu: ఆరోగ్య సేతు యాప్‌తో రిస్క్ ఉందా? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

Aarogya Setu: ఆరోగ్య సేతు యాప్‌తో రిస్క్ ఉందా? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
(ప్రతీకాత్మక చిత్రం)

Aarogya Setu: ఆరోగ్య సేతు యాప్‌తో రిస్క్ ఉందా? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం (ప్రతీకాత్మక చిత్రం)

Aarogya Setu app | మీరు ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లోడ్ చేశారా? ఆరోగ్య సేతు యాప్ యూజర్ల డేటాకు ముప్పు ఉందని ఎథికల్ హ్యాకర్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

    ఆరోగ్య సేతు యాప్... కోవిడ్ 19 పేషెంట్లను ట్రాక్ చేసేందుకు, కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ఇది. ఇప్పటి వరకు 9 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నట్టు ప్రభుత్వ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే ఈ యాప్‌ యూజర్ల ప్రైవసీ రిస్క్‌లో ఉందంటూ ఫ్రెంచ్ హ్యాకర్, సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ ఎల్లియాట్ ఆల్డర్సన్ ట్వీట్ చేయడం కలకలం రేపుతోంది. తొమ్మిది కోట్ల మంది యూజర్ల ప్రైవసీని ప్రభుత్వం రిస్కులో పెట్టిందని సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్స్ హెచ్చరించారు. దీంతో ఆరోగ్య సేతు యాప్‌తో రిస్క్ ఉందా అన్న అనుమానాలు, భయాలు యూజర్లలో మొదలయ్యాయి. ఇప్పటికే ఈ యాప్‌ను కోట్లాది మంది డౌన్‌లోడ్ చేసుకొని ఉపయోగిస్తున్నారు. తమ వివరాలన్నీ అందులో అప్‌డేట్ చేశారు.


    సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ ఎల్లియాట్ ఆల్డర్‌సన్ ట్వీట్‌కు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆరోగ్య సేతు యాప్‌లో ఇప్పటి వరకు డేటా లేదా సెక్యూరిటీ బ్రీచ్ గుర్తించలేదని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ప్రైవసీ ప్రొటెక్షన్, డేటా సేఫ్టీ, సెక్యూరిటీ విషయంలో ఆరోగ్య సేతు యాప్ పటిష్టంగా ఉందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. "ఎథికల్ హ్యాకర్ హెచ్చరించినట్టుగా ఏ ఒక్కరి వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో లేదు. మేము నిరంతరాయంగా పరీక్షిస్తూ మా సిస్టమ్స్‌ని అప్‌గ్రేడ్ చేస్తున్నాం" అని ఆరోగ్య సేతు టీమ్ ట్వీట్ చేసింది.


    యాప్ యూజర్ల లొకేషన్ ట్రాక్ చేసి సర్వర్‌లో స్టోర్ చేస్తుందని, ఆ సర్వర్లు సురక్షితంగా ఉండటంతో పాటు రిజిస్ట్రేషన్ సమయంలో, సెల్ఫ్ అసెస్‌మెంట్ సమయంలో, యూజర్లు తమ కాంటాక్ట్ ట్రేసింగ్ డేటాను స్వచ్ఛందంగా యాప్‌లో వివరించిన డేటా ఎన్‌క్రిప్ట్ అయి ఉంటుందని ఆరోగ్య సేతు టీమ్ వివరించింది. ఆరోగ్య సేతు వివరణపై సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ ఎల్లియాట్ ఆల్డర్‌సన్ స్పందించారు. దీనిపై రేపు స్పందిస్తానని ట్వీట్ చేశారు.


    ఫ్రెంచ్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ ఎల్లియాట్ ఆల్డర్‌సన్ పేరు గతంలోనూ వార్తల్లోకి వచ్చింది. గతంలో ఎంఆధార్ ఆండ్రాయిడ్ యాప్‌లో సమస్యల్ని గుర్తించి భారత ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు.

    ఇవి కూడా చదవండి:

    PF Balance: మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత? ఈ స్టెప్స్‌తో తెలుసుకోండి

    Loan: రూపాయి వడ్డీకే లోన్ తీసుకోవచ్చు... ఆ స్కీమ్‌లో ఉన్నవారికే అవకాశం

    Cash Withdrawal: ఏటీఎంలో డబ్బులు లేవా? షాపులో తీసుకోవచ్చు
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Aarogya Setu, Android, Android 10, Corona, Corona virus, Coronavirus, Covid-19, DATA BREACH, Data theft, Hacking, Lockdown, Mobile App, Personal Data

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు