Aarogya Setu: ఆరోగ్య సేతు యాప్ యూజర్లకు గుడ్ న్యూస్... ఈ ఫీచర్ మీకోసమే

Aarogya Setu App | ఆరోగ్య సేతు యాప్‌లో యూజర్ల డేటాపై అనేక భయాలు ఉన్న సంగతి తెలిసిందే. ఆ భయాలను తొలగించేందుకు సరికొత్త ఫీచర్‌ను రిలీజ్ చేశారు యాప్ డెవలపర్లు.

news18-telugu
Updated: July 7, 2020, 3:32 PM IST
Aarogya Setu: ఆరోగ్య సేతు యాప్ యూజర్లకు గుడ్ న్యూస్... ఈ ఫీచర్ మీకోసమే
Aarogya Setu: ఆరోగ్య సేతు యాప్ యూజర్లకు గుడ్ న్యూస్... ఈ ఫీచర్ మీకోసమే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు ఆరోగ్య సేతు యాప్ వాడుతున్నారా? ఆరోగ్య సేతు యాప్‌లో మీ డేటా దుర్వినియోగం అవుతుందని భయపడుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. భారతదేశానికి చెందిన అధికారిక కోవిడ్ 19 కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్ రిలీజ్ అయినప్పటి నుంచి యూజర్ల డేటాకు ముప్పు ఉందని, డేటాను దుర్వినియోగం చేస్తారన్న ప్రచారం జరిగింది. ఈ ఆందోళనతో అనేక మంది ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లోడ్ చేయడానికి భయపడ్డారు. అయితే యూజర్ల డేటాకు వచ్చిన ముప్పేమీ లేదని యాప్ డెవలపర్లు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికీ ఆరోగ్య సేతు యాప్‌లో యూజర్ల డేటా విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయి. దీంతో యాప్ డెవలపర్లు మరో నిర్ణయం తీసుకున్నారు. యూజర్లు తమ అకౌంట్‌ను శాశ్వతంగా డిలిట్ చేసే అవకాశాన్ని ఇస్తున్నారు.

కరోనా కష్టకాలంలో అప్పులు ఇస్తున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి

ఆరోగ్య సేతులో కొత్తగా తీసుకొచ్చిన ఈ ఫీచర్‌తో యూజర్లు తమ అకౌంట్‌ను శాశ్వతంగా డిలిట్ చేయొచ్చు. అంతేకాదు... ఇప్పటి వరకు ఆరోగ్య సేతు యాప్‌లో స్టోర్ అయిన డేటాను కూడా పూర్తిగా తొలగించొచ్చు. అయితే అకౌంట్ డిలిట్ కావడంతో డేటా శాశ్వతంగా ఫోన్ నుంచి డిలిట్ అవుతుంది. కానీ మీ డేటా ప్రభుత్వ సర్వర్లలో ఉంటుంది. 30 రోజుల తర్వాత ప్రభుత్వ సర్వర్ల నుంచి డేటా డిలిట్ అవుతుంది. ఇక ఈ ఫీచర్‌తో పాటు బ్లూటూత్ కాంటాక్ట్స్ ద్వారా కరోనా వైరస్ సోకే రిస్కును గుర్తించేలా యాప్‌లో మార్పులు చేశారు. ఆరోగ్య సేతు యాప్ అప్‌డేట్ చేసేవారికి ఈ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. మీరు కూడా మీ ఆరోగ్య సేతు యాప్ అప్‌డేట్ చేసి ఈ ఫీచర్స్ ఉపయోగించొచ్చు. ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్ యూజర్లకు ఈ అప్‌డేట్స్ వస్తున్నాయి.

WhatsApp trick: వాట్సప్ స్టేటస్ సీక్రెట్‌గా చూడొచ్చు ఇలా

ఇక థర్డ్ పార్టీ యాప్స్ కూడా ఆరోగ్య సేతులోని మీ హెల్త్ స్టేటస్‌ను యాక్సెస్ చేయొచ్చు. ఇందుకోసం మీరు సెట్టింగ్స్‌లో ఆరోగ్య సేతు స్టేటస్ అప్రూవల్ ఇవ్వాలి. అప్పుడే మీ డేటాను థర్డ్ పార్టీ యాప్స్ యాక్సెస్ చేయడం సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఐఓఎస్ డివైజ్‌లలో మాత్రమే ఉంది. త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రావొచ్చు.
Published by: Santhosh Kumar S
First published: July 7, 2020, 3:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading