కేవలం 2 రూపాయలకే భోజనం అందిస్తున్న ... ఓ యువ సైన్యం

అన్ని దానాల కంటే గొప్ప దానం అన్నదానం

కేవలం రెండు రూపాయలకే మంచి ఫుడ్ అందిస్తోంది కామారెడ్డి జిల్లాలోని సైన్య సేన యుత్....

  • Share this:
    కామారెడ్డి జిల్లా:  అన్ని దానాల కంటే గొప్ప దానం అన్నదానం అంటారు... అలాంటి దానాన్ని ఓ యువ సైన్యం ప్రతిరోజూ చూస్తోంది... కరోనా నేపథ్యంలో బయట ఎక్కడ తినాలన్న ప్రజలు జంకుతున్నారు. ఇలాంటి సమయంలో కేవలం రెండు రూపాయలకే మంచి ఫుడ్ అందిస్తోంది కామారెడ్డి జిల్లాలోని సైన్య సేన యుత్..
    కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు సైన్య సేన ఆధ్వర్యంలో రెండు రూపాయలకే భోజన కేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లా ఆస్పత్రికి వచ్చే రోగులు, ఆటో కార్మికులకు తినడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని భావించిన సైన్యసేన యువకులు... 2/- రూపాయలకే భోజనాన్ని అందించడానికి నిర్ణయించారు. గతంలో ఇదే సైన్య సేన ఆధ్వర్యంలో 10 రూపాయలకే భోజనం అందించారు. ఈ సందర్భంగా సైన్యసేన ప్రతినిధి ఎర్రోళ్ల నరేష్ మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. జిల్లా ఆస్పత్రికి వచ్చే రోగులకు కడుపునిండా భోజనం పెట్టాలన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము.. ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒకటిన్నర గంటల వరకు భోజనం అందిస్తున్నము అన్నారు... అతి తక్కువ ధరకే అనాథల ఆకలి తీర్చుతున్న ఈ యూత్ సభ్యులను మనం అభినందించాల్సిందే..
    Published by:Venu Gopal
    First published: