Covid19: విమానంలోనే చనిపోయిన కరోనా బాధితురాలు.. నిర్లక్ష్యమే కొంప ముంచిందా?

Covid19: విమానంలోనే చనిపోయిన కరోనా బాధితురాలు.. నిర్లక్ష్యమే కొంప ముంచిందా?

ప్రతీకాత్మక చిత్రం

Covid19: కోవిడ్-19 సోకిన ఒక ప్రయాణికురాలు విమానంలో చనిపోయిందని అమెరికా అధికారులు చెబుతున్నారు. జులైలో అరిజోనా నుంచి టెక్సాస్‌కు బయలుదేరబోయే విమానంలో ఆమె మరణించినట్లు ఆదివారం తెలిపారు.

  • Share this:
కోవిడ్-19 సోకిన ఒక ప్రయాణికురాలు విమానంలోనే కన్నుమూసింది. ఈ మేరకు అమెరికా అధికారులు వివరాలు వెల్లడించారు. జులైలో అరిజోనా నుంచి టెక్సాస్‌కు బయలుదేరబోయే విమానంలో ఆమె మరణించిదని తెలిపారు. ఈ విషయాన్ని ఆదివారం అధికారులు ప్రకటించారు. మరణించిన మహిళది టెక్సాస్‌లోని గార్లాండ్ ప్రాంతమని తేల్చారు. అరిజోనాలో ఎయిర్‌పోర్ట్‌లోనే, విమానం రన్‌వే పైకి వెళ్లకముందే ఆమె చనిపోయిందని డల్లాస్ కౌంటీ అధికారి లారెన్ ట్రింబుల్ చెప్పారు. చనిపోయేనాటికి COVID-19 ఉందనే విషయం సదరు మహిళకు తెలుసా? లేదా? అనే వివరాలపై స్పష్టమైన సమాచారం లేదని ఆయన వెల్లడించారు.

కరోనా మరణమే..
చనిపోయే ముందు ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. దీంతో ఆమెకు ఆక్సిజన్ అందించారని డల్లాస్ కౌంటీ జడ్జి క్లే జెంకిన్స్ తెలిపారు. ఆమెకు అధిక ప్రమాద తీవ్రత ఉన్న అనారోగ్యాలు (హై రిస్క్ హెల్త్ కండీషన్స్) కూడా ఉన్నాయని అధికారులు ఆదివారం ఒక వార్తా ప్రకటనలో తెలిపారు. జూలై 25న ఆ మహిళ చనిపోయినప్పటికీ, కొద్ది రోజుల క్రితం వరకు ఇది COVID-19 సంబంధిత మరణం అని అధికారులు గుర్తించలేదని జెంకిన్స్ చెప్పారు. సీడీసీ నియమ నిబంధనల ప్రకారం ఇది COVID-19 మరణమేనని ట్రింబుల్ పేర్కొన్నారు.

నిర్లక్ష్యం వద్దు
ఈ కేసు గురించి కౌంటీ అధికారులు మరిన్ని వివరాలు వెల్లడించలేదు. ‘ముప్పైలలో ఉన్న ఆ మహిళ కరోనా కారణంగా మరణించింది. దీంతో కోవిడ్19కు వయసుతో సంబంధం లేదని తెలుస్తోంది’ అని జెంకిన్స్ చెప్పారు. ‘కోవిడ్ హెచ్చరికల ప్రకారం తాము హై రిస్క్ జోన్‌లో లేమని చాలామంది అనుకుంటారు. వారికి ఇదొక కనువిప్పు కావాలి’ అని ఆయన వాఖ్యానించారు.

కరోనాకు వయసుతో సంబంధం లేదు..
కరోనా వెలుగు చూసిన కొత్తలో దాని ప్రభావం వృద్ధుల్లో అత్యధికంగా ఉండేది. కానీ జూన్ నుంచి ఆగస్టు వరకు నమోదైన కేసులను పరిశీలిస్తే ఈ ధోరణి మారినట్లు సీడీసీ సర్వే చెబుతోంది. తాజా అధ్యయనంలో 20 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసున్న వారు కూడా మహమ్మారి ప్రభావానికి గురవుతున్నట్లు తేలింది. 18 నుంచి 34 సంవత్సరాల మధ్య వయసు ఉన్న కోవిడ్ పేషెంట్లలో, ప్రతీ ఐదుగురిలో ఒకరు కొన్ని వారాల వరకు కోలుకోలేదని సీడీసీ నిర్వహించిన మరో అధ్యయనం వెల్లడించింది. వారిని దీర్ఘకాలిక అనారోగ్యాలు వేధించే అవకాశం ఉంది.

టెక్సాస్‌లో పెరిగిన కేసులు
సోమవారం వరకు టెక్సాస్‌లో 8,68,917 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 17,541 మంది చనిపోయినట్లు నూయర్క్ టైమ్స్ వార్తా సంస్థ చెబుతోంది. అధ్యక్ష్య ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో అమెరికాలో కోవిడ్19 థర్డ్ వేవ్ మొదలయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. టెక్సాస్‌లో కరోనా చికిత్స కోసం హాస్పిటల్‌లో చేరేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో ఆ రాష్ట్రం మరోసారి కోవిడ్ కేసుల ఉప్పెనను చూసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉత్తర టెక్సాస్‌లో గత వారం ఎక్కువ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో డల్లాస్ కౌంటీ మరోసారి వైరస్ ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉందని జెంకిన్స్ ట్వీట్ చేశారు.
Published by:Nikhil Kumar S
First published: