Corona కారణంగా ఉద్యోగం పోయి.. పొట్టకూటికి దినసరి కూలీగా మారి..

Corona కారణంగా ఉద్యోగం పోయి.. పొట్టకూటికి దినసరి కూలీగా మారి..

దినసరి కూలీగా రమేశ్..

Corona కారణంగా ప్రైవేట్ టీచర్ల పరిస్థితి అద్వాన్నంగా మారింది. తక్కువ జీతానికైనా సరేనని పని చేసుకునే వీరి జీవితాలు దుర్భరమయ్యాయి. దీంతో ఉపాధ్యాయులలో చాలా మంది వంద రోజుల పనికి వెళ్తుండగా.. పలువురు గొర్ల కాపర్లుగా.. మరికొందరు వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు.

  • News18
  • Last Updated:
  • Share this:
    కరోనా కారణంగా సమస్త రంగాలు సంక్షోభంలో మునిగిపోయాయి. అన్లాక్ ల ప్రక్రియ మొదలైనా.. ఇంకా బడులు మాత్రం పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. దీంతో ప్రైవేట్ టీచర్ల పరిస్థితి అద్వాన్నంగా మారింది. ఉన్న ఊర్లో.. వచ్చే తక్కువ జీతానికైనా సరేనని పని చేసుకునే వీరి జీవితాలు దుర్భరమయ్యాయి. దీంతో ఉపాధ్యాయులలో చాలా మంది వంద రోజుల పనికి వెళ్తుండగా.. పలువురు గొర్ల కాపర్లుగా.. మరికొందరు వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. ఏ ఆధారమూలేని వాళ్లు అడ్డా మీద దినసరి కూలీలుగా కూడా మారారు. మహబూబ్ నగర్ కు చెందిన ఉపాధ్యాయ దంపతులు.. రోజూవారీ కూలీ చేసుకుంటూ బతుకు బండిని ఈడ్చుకొస్తున్నారు.

    కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ పుణ్యమా అంటూ ఉపాధ్యాయుల కుటుంబాలు కూలీలుగా మారాయి. కరోనా కాలంలో పాఠశాలలు మూతపడడంతో ఇల్లు గడవడం కష్టంగా మారడంతో ఆ దంపతులు దినసరి కూలీలుగా మారారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రమేశ్ (MA Bed)-సరిత (M.ed) దంపతులు ఉన్నత చదువులు చదివారు. వీరిది కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెల్లి గ్రామం. అక్కడ్నుంచి వచ్చి.. జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ స్కూల్లో బోధించేవారు.

    పాఠశాలలు బాగా నడిచినప్పుడు ఇద్దరికీ సరిపడా జీతం వచ్చేది. దానితో ఆ దంపతులిద్దరూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేవాళ్లు. రమేశ్ కు అమ్మానాన్న, ఇద్దరు చెల్లెలతో పాటు ఒక తమ్ముడు ఉన్నారు. లాక్డౌన్ తో రమేశ్ దంపతులకు ఉద్యోగాలు కోల్పోవడంతో అప్పట్నుంచి వారికి కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో గత్యంతరం లేక రోజువారీ కూలి కి వెళ్తున్నారు.

    రమేశ్.. 2007 లో టీటీసీ చేసి 2012లో ఒక్క మార్కు తో డీఎస్సీ రాకపోవడంతో ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం చూసుకున్నారు. కుటుంబంలో రమేష్ పెద్దవాడు కావడంతో కుటుంబపోషణ అతడిమీదే పడింది. ఇక తాజాగా తాను చేసే పేయింటింగ్ పనిలో అనుభవం లేకపోవడంతో వేరే వాళ్ళ కన్నా తక్కువ కూలి ఇస్తున్నారని రమేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

    ఇదే విషయమై రమేశ్ స్పందిస్తూ.. ‘అన్ని వృత్తుల కన్నా ఉపాధ్యాయ వృత్తి మేలు అనుకున్నాను. కానీ ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఏనాడూ ఊహించలేదు. నాలాంటి పరిస్థితే చాలామంది ప్రైవేటు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నారు. వారు కూడా పూట గడవక చాలా ఇబ్బందులు గురవుతున్నారంటూ’ ఆవేదన వ్యక్తం చేశాడు
    Published by:Srinivas Munigala
    First published: