పిడుగులాంటి వార్త.. పెళ్లి కానీ పురుషులకు కరోనా మరణం ముప్పు ఎక్కువ.. తాజా అధ్యయనంలో వెల్లడి

పిడుగులాంటి వార్త.. పెళ్లి కానీ పురుషులకు కరోనా మరణం ముప్పు ఎక్కువ.. తాజా అధ్యయనంలో వెల్లడి

ప్రతీకాత్మక చిత్రం

కరోనా గురించి ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి.తాజాగా స్వీడన్‌లోని స్టాక్‌హొమ్ యూనివర్సిటీ జరిపిన ఒక అధ్యయనం పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

 • Share this:
  కరోనా గురించి ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. వైరస్ ఏ రకంగా వ్యాప్తి చెందుతుంది?, ఏ వయసు వారిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది?, కాలక్రమంలో కరోనా వైరస్ దాని తీవ్రతను కోల్పోతుందా?.. ఇలా అనేక రీసెర్చ్‌లు కొనసాగుతున్నాయి. తాజాగా స్వీడన్‌లోని స్టాక్‌హోమ్ యూనివర్సిటీ జరిపిన ఒక అధ్యయనం పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. పెళ్లి కానీ మగవారు కరోనాతో చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉందని తెలిపింది. తక్కువ ఆదాయం, తక్కువ విద్యను అభ్యసించినవారు, పెళ్లి చేసుకోనివారు, తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లో జన్మించినవారికి కరోనా వల్ల మరణం సంభవించే ముప్పు ఎక్కువగా ఉందని ఈ అధ్యయనంలో పాల్గొన్న స్వెన్ డెప్రాల్ హెచ్చరించారు. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలను ది జనరల్ నేచర్ కమ్యూనికేషన్‌లో ప్రచురించారు.

  వివిధ రకాల వ్యక్తిగత ప్రభావాలు కరోనా వైరస్ మరణం ముప్పును ఎక్కువ చేసే అవకాశం ఉన్నట్టుగా డెప్రాల్ చెప్పారు. దీని తాము ఆధారాలు కూడా చూపించగలమని తెలిపారు. ఈ కారకాలన్నీ కరోనాతో చనిపోయే రిస్క్‌ను పెంచేలా ఉన్నాయని హెచ్చరించారు. ఈ అధ్యయనం కోసం స్వీడిష్ నేషనల్ బోర్డ్ ఆఫ్ వెల్ఫేర్‌ నుంచి 20 ఏళ్లు అతకంటే పైబడి కరోనాతో మరణించిన వివరాలు తీసకున్నట్టు తెలిపారు.

  పెళ్లి చేసుకున్న వారితో పోలిస్తే పెళ్లి కానీ మహిళలు, పురుషుల్లో(ఎప్పటికీ పెళ్లి చేసుకోని వారు, విడాకులు తీసుకున్నారు, వితంతువులు కూడా) కరోనా వైరస్ మరణం ముప్పు ఎక్కువగా ఉంటుందని ఆ అధ్యయనంలో తేలింది. పెళ్లికాని మహిళల కంటే పెళ్లికాని పురుషులకే రెట్టింపు ముంపు పొంచి ఉందన్నారు. ఈ విషయం గతంలో జరిపిన పరిశోధనలో తేలిందన్నారు. "పెళ్లి కాని వారితో పోలిస్తే పెళ్లైన వారితోనే ఆరోగ్యవంతమైన జీవితం ఉంటుంది. కరోనా సోకినా మరణం ముప్పు కూడా పెళ్లైన వారిలో తక్కువగా ఉంటుంది" అని డెప్రాల్ చెప్పారు. పెళ్లికానీ వారికి వివిధ వ్యాధుల నుండి మరణాలు ఎక్కువగా ఉన్నాయని గతంలో అనేక అధ్యయనాలు తెలిపాయని పరిశోధకులు పేర్కొన్నారు.
  Published by:Sumanth Kanukula
  First published:

  అగ్ర కథనాలు