షాకింగ్..స్మార్ట్‌ఫోన్లు, కరెన్సీపై 28 రోజులు సజీవంగా కరోనా వైరస్

షాకింగ్..స్మార్ట్‌ఫోన్లు, కరెన్సీపై 28 రోజులు సజీవంగా కరోనా వైరస్

ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి, విస్తరణ గురించి అనేక పరిశోధనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆయా వస్తువులపై కరోనా ఎంతకాలం సజీవంగా ఉంటుందనేదానిపై తాజాగా ఆస్ట్రేలియా నేషనల్ సైన్ ఏజెన్సీ షాకింగ్ విషయాలను వెల్లడించింది.

 • Last Updated:
 • Share this:
  ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి, విస్తరణ గురించి అనేక పరిశోధనలు కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ వస్తువుల ఉపరితలాలపై ఎంతకాలం నిలిచి ఉంటుందనేదానిపై పలు రకాల పరిశోధన కథనాల వెలువడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయా వస్తువులపై కరోనా ఎంతకాలం సజీవంగా ఉంటుందనే దానిపై తాజాగా ఆస్ట్రేలియా నేషనల్ సైన్ ఏజెన్సీ షాకింగ్ విషయాలను వెల్లడించింది. బ్యాంక్ నోట్లు, స్మార్ట్‌ఫోన్ స్క్రీన్స్ వంటి గ్లాస్ వస్తువుల ఉపరితలాలపై కరోనా వైరస్ 28 రోజుల పాటు కరోనా సజీవంగా ఉంటుందని తమ అధ్యయనంలో వెల్లడైందని తెలిపింది. వైరాలజీ జర్నల్ ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలను పబ్లిష్ చేశారు. కరోనా వైరస్ ఉపరితలాలపై ఎక్కువకాలం బతికే ఉండగలదని.. అందుకే తరుచూ చేతులు కడుక్కోవడం, ఉపరితలాలను శుభ్రపరచడం చేయడం మంచిదని సూచించారు.

  ఆస్ట్రేలియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రిపేర్డ్‌నెస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధనల్లో.. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద కరోనా వైరస్ ఎక్కువ యాక్టివ్‌గా ఉంటుందని తేలింది. అలాగే గరుకుగా ఉన్న ఉపరితలాల కన్నా మృదువైన ఉపరితలాల మీద వైరస్ ఎక్కువకాలం జీవించి ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. కాటన్ ఉపరితలంపై కన్నా గ్లాస్ స్టెయిన్‌లెస్ స్టీల్, వినైల్ ఉపరితలాలపై ఎక్కువ కాలం సజీవంగా ఉంటుదన్నారు. "ప్లాస్టిక్ బ్యాంక్ నోట్ల కన్నా, కాగితపు బ్యాంక్ నోట్లపై కరోనావైరస్ ఎక్కువకాలం జీవిస్తుంది. ఉపరితలాల మీద కరోనా వైరస్ ఎంతకాలం యాక్టివ్‌గా ఉంటుందో అంచనా వేయడం ద్వారా.. వైరస్ వ్యాప్తి తగ్గించడంతోపాటుగా, ప్రజలను వైరస్ బారి నుంచి రక్షించుకోవడానికి తోడ్పడుతుంది" అని సీఎస్‌ఐఆర్‌ఓ చీఫ్ లారీ మార్షల్ అన్నారు..

  "20 డిగ్రీల సెల్సియస్ ఉష్టోగ్రత వద్ద కరోనా వైరస్ వ్యాప్తి బలంగా ఉందని మేము గుర్తించాం. గ్లాస్ వస్తువుల్లాంటి మృదువైన ఉపరితలాలపై(మొబైల్ ఫోన్ స్క్రీన్స్, ప్లాస్టిక్ బ్యాంక్ నోట్లు..) కరోనా 28 రోజులపాటు సజీవంగా ఉంటుంది" అని ఏసీడీపీ డిప్యూటీ డైరెక్టర్ డెబ్బీ ఈగల్స్ తెలిపారు. అయితే ఇదే విధంగా 30, 40 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ వద్ద కూడా ప్రయోగాలు నిర్వహించినప్పుడు.. వస్తువుల ఉపరితలాల మీద కరోనా వైరస్ జీవించేకాలం తగ్గిందని పేర్కొన్నారు. సూర్య కాంతి ఎక్కువగా ఉంటే కరోనావైరస్ వేగంగా క్రియారహితం అవుతున్నందు వల్ల చీకటిలో కూడా ఈ ప్రయోగాలు నిర్వహించినట్టు చెప్పారు. అయితే ఆయా వస్తువుల ఉపరితలాలపై ఏరకంగా సంక్రమణ చెందుతుందో ఇంకా పరిశోధన జరపాల్సి ఉందన్నారు.
  Published by:Sumanth Kanukula
  First published:

  అగ్ర కథనాలు