Coronavirus: షాకింగ్.. ముక్కు నుంచి మెదడుకు కరోనా.. తాజా అధ్యయనంలో వెల్లడి

Coronavirus: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు సంబంధించిన పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఓ అధ్యయనంలో కరోనాకు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి.

news18-telugu
Updated: November 30, 2020, 9:22 PM IST
Coronavirus: షాకింగ్.. ముక్కు నుంచి మెదడుకు కరోనా.. తాజా అధ్యయనంలో వెల్లడి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు సంబంధించిన పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఓ అధ్యయనంలో కరోనాకు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. కరోనా వైరస్ ముక్కు నుంచి మెదడులోకి వెళ్లే అవకాశం ఉందని ఆ అధ్యయనం పేర్కొంది. కరోనా సోకినవారిలో గమనించిన న్యూరోలాజికల్ లక్షణాలు బట్టి వైరస్ నియంత్రణకు, చికిత్సకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించింది. తాజాగా ది జర్నల్ నేచర్ న్యూరోసైన్స్‌‌లో ఈ పరిశోధన పబ్లిష్ అయింది. క‌రోనా వైర‌స్ కేవ‌లం శ్వాస‌కోస వ్య‌వ‌స్థ‌పైనే కాకుండా కేంద్ర నాఢీ వ్య‌వ‌స్థ‌పైనా ప్ర‌భావం చూపుతున్న‌ట్లు ఆ అధ్యయనం పేర్కొంది. ఈ ఫ‌లితంగానే రుచి, వాస‌న కోల్పోవ‌డం, త‌ల‌నొప్పి, అల‌స‌ట‌ వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్న‌ట్లు తెలిపింది.

ఇటీవలి రీసెర్చ్‌లో బ్రైన్, సెరెబ్రోస్పానియల్ ద్రవంలో వైరల్ ఆర్‌ఎన్‌ఏ ఉనికి గురించి వివరించినప్పటికీ.. వైరస్ ఎలా ప్రవేశిస్తుంది, మెదడులోకి ఎలా వ్యాప్తి చెందుతుందనే విషయాలపై మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. జర్మనీలోని చారైట్ యూనివర్సిటాటెస్మాడిజిన్ బెర్లిన్ పరిశోధకులు నాసికాగ్రసనిని పరిశీలించారు. కోవి‌డ్ బారినపడి మరణించిన 33 మంది బాధితుల్లో నాసికా కుహరానికి అనుసంధానించే గొంతు పైభాగాన్ని, మెదడుడును పరిశీలించారు. ఇందులో 22 మంది పురుషులు, 11 మంది స్త్రీలు కరోనాతో మృతిచెందినవారు ఉన్నారు. మృతిచెందిన వారి సగటు వయసు 71.6 ఏళ్లుగా పేర్కొన్నారు. కరోనా లక్షణాలు మొదలైనప్పటి నుంచి మరణించిననాటికి పట్టిన సమయం సగటున 31 రోజులుగా తేల్చారు.

ఇక, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 6 కోట్ల 32 లక్షలు దాటింది. ఇప్పటివరకు అత్యధికంగా అమెరికాలో 1.37 కోట్లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 94 లక్షలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారినపడి 14.6 లక్షలకు పైగా మృతిచెందగా, 4.37 కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు.
Published by: Sumanth Kanukula
First published: November 30, 2020, 9:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading