హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Breaking: పెళ్లికి వెళుతున్నారా.. 300 మంది హాజరైన పెళ్లిలో 9 మందికి సోకిన ఒమిక్రాన్.. ఆ పెళ్లి ఎక్కడ జరిగిందంటే..

Breaking: పెళ్లికి వెళుతున్నారా.. 300 మంది హాజరైన పెళ్లిలో 9 మందికి సోకిన ఒమిక్రాన్.. ఆ పెళ్లి ఎక్కడ జరిగిందంటే..

ప్రస్తుత నెలలో, హైదరాబాద్‌లో రోజువారీ కేసులు జనవరి 8న అత్యధికంగా 1,583 నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో అనేక జిల్లాలలో కరోనా కేసులు బాగానే పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుత నెలలో, హైదరాబాద్‌లో రోజువారీ కేసులు జనవరి 8న అత్యధికంగా 1,583 నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో అనేక జిల్లాలలో కరోనా కేసులు బాగానే పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతీకాత్మక చిత్రం

ఒమిక్రాన్. ప్రస్తుతం ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ఈ కొత్త కరోనా వేరియంట్ ప్రపంచానికి మరోసారి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ప్రస్తుతానికైతే మన దేశంలో ఈ వేరియంట్ కేసులు తక్కువగానే ఉన్నప్పటికీ ఫిబ్రవరిలో రోజుకు లక్ష కేసులు నమోదవుతాయన్న హెచ్చరికలే ఆందోళన కలిగిస్తున్నాయి.

ఇంకా చదవండి ...

జైపూర్: ఒమిక్రాన్. ప్రస్తుతం ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ఈ కొత్త కరోనా వేరియంట్ ప్రపంచానికి మరోసారి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ప్రస్తుతానికైతే మన దేశంలో ఈ వేరియంట్ కేసులు తక్కువగానే ఉన్నప్పటికీ ఫిబ్రవరిలో రోజుకు లక్ష కేసులు నమోదవుతాయన్న హెచ్చరికలే ఆందోళన కలిగిస్తున్నాయి. థర్డ్ వేవ్‌కు (Third Wave) సంకేతాలనిస్తున్నాయి. తాజాగా ఒమిక్రాన్ వేరియంట్‌కు (Omicron) సంబంధించి ఓ విషయం తెలిసింది. రాజస్థాన్‌లోని (Rajasthan) జైపూర్‌లో ఒకే కుటుంబంలోని 9 మందికి ఒమిక్రాన్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. వీళ్లంతా సౌతాఫ్రికాలోని జొహెన్స్‌బర్గ్ నుంచి భారత్‌కు వచ్చినట్లు తెలిసింది. జైపూర్‌లోని సిటీ ప్యాలెస్‌లో ఓ పెళ్లికి హాజరయ్యేందుకు నవంబర్ 28న ఈ కుటుంబం భారత్‌కు వచ్చినట్లు అధికారులు గుర్తించారు.

పెళ్లికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన వధువుకు, శిఖర్‌లోని అజిత్‌గర్‌కు చెందిన వరుడికి జైపూర్ (Jaipur) సిటీ ప్యాలెస్‌లో నవంబర్ 28న ఘనంగా పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి ఒమిక్రాన్ సోకిన కుటుంబం హాజరైంది. అయితే.. అప్పటికి వారికి ఈ వైరస్ సోకినట్లు తెలియదు. దాదాపు 300 మందికి పైగా ఈ పెళ్లికి హాజరయినట్లు తెలిసింది. దీంతో.. ఆ 300 మందిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. అయితే.. ఆ 300 మంది ఇన్ని రోజుల వ్యవధిలో ఇంకెంత మందిని కలిసి ఉంటారనే విషయం తలుచుకుంటేనే అక్కడి వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. 300 మందిని అయితే గుర్తించడం కష్టం కాకపోయినప్పటికీ ఆ 300 మంది ఈ కొన్నిరోజుల్లో వేల మందితో కాంటాక్ట్ అయి ఉంటారు. వాళ్లందరినీ గుర్తించడం ఒకింత కష్ట సాధ్యమైన పనేనని చెప్పక తప్పదు. జైపూర్, శిఖర్, ఢిల్లీ నుంచి ఈ పెళ్లికి హాజరయిన వారిని గుర్తించి వారి శాంపిల్స్ సేకరించే పనిలో వైద్యాధికారులు ఉన్నారు. మరోపక్క.. ఆ పెళ్లి జరిగిన సిటీ ప్యాలెస్‌కు సోమవారం ఓ మెడికల్ టీం వెళ్లింది. సిటీ ప్యాలెస్ సిబ్బంది, క్యాటరింగ్, ఈవెంట్ సిబ్బంది కూడా ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారితో కాంటాక్ట్ అయి ఉండొచ్చని భావించి వారి శాంపిల్స్ కూడా సేకరించారు.

ఇది కూడా చదవండి: Omicron: ప్రపంచాన్ని భయపెడుతున్న ఒమిక్రాన్.. దీని గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే

అంతేకాకుండా.. ఒమిక్రాన్ సోకిన ఈ కుటుంబం ఎయిర్‌పోర్ట్ నుంచి వెళ్లేందుకు ఉబర్ క్యాబ్‌లో వెళ్లినట్లు తెలిసింది. దీంతో.. ఆ క్యాబ్‌ను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. ఆ క్యాబ్ నవంబర్ 28 నుంచి ఇంకెంత మందిని ఎక్కించుకుని దింపేసి ఉంటుందో.. అందులో ప్రయాణించిన వారు ఇంకెంత మందితో కాంటాక్ట్ అయి ఉంటారో అనే ఆందోళన ఈ విషయం తెలిసిన వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పెళ్లికి హాజరైన ఈ కుటుంబం వరుడి బంధువులని.. పెళ్లి తర్వాత కూడా కొన్నిరోజులు వరుడి ఇంట్లోనే ఉన్నారని.. అక్కడే భోజనం కూడా చేశారని అధికారులు చెప్పారు. ఇదిలా ఉండగా.. పెళ్లికి హాజరైన ఈ 300 మందిని గుర్తించి జైపూర్, శిఖర్, ఢిల్లీలో వాళ్లు ఇంకెవరితో కాంటాక్ట్ అయ్యారో తెలుసుకునే పనిలో వైద్య సిబ్బంది తలమునకలైంది. ఇదిలా ఉంటే.. ఒమిక్రాన్ సోకిన ఆ కుటుంబంలో 9 మంది ఉండగా.. వారిలో ముగ్గురు చిన్నారులు ఉండటం గమనార్హం. మిగిలిన ఆరుగురు ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. చిన్నారులకు వ్యాక్సిన్ తీసుకునే అవకాశం లేకపోవడంతో వారి ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. RUHS హాస్పిటల్‌లో ప్రస్తుతం వీరికి చికిత్సనందిస్తున్నారు.

First published:

Tags: Corona third wave, Corona virus, Jaipur, Omicron, Omicron corona variant

ఉత్తమ కథలు