• HOME
  • »
  • NEWS
  • »
  • CORONAVIRUS-LATEST-NEWS
  • »
  • A OLD WOMAN ON ROAD WITH OXYGEN CYLINDER PHOTO VIRAL IN SOCIAL MEDIA WAS NOT CLICKED RECENT NO CONNECTION WITH CORONA HSN

Fact Check: ఆక్సిజన్ సిలిండర్ తో రోడ్డుపక్కనే దీనంగా ఓ వృద్ధురాలు.. నెట్టింట తెగ వైరల్ అయిన ఈ ఫొటో వెనుక ఉన్న అసలు కథేంటంటే..

Fact Check: ఆక్సిజన్ సిలిండర్ తో రోడ్డుపక్కనే దీనంగా ఓ వృద్ధురాలు.. నెట్టింట తెగ వైరల్ అయిన ఈ ఫొటో వెనుక ఉన్న అసలు కథేంటంటే..

వైరల్ ఫొటో (Image and Video Credit: ANI)

ఆక్సిజన్ సిలిండర్ సాయంతో శ్వాస పీల్చుకోగలుగుతున్న ఓ వృద్ధురాలి ఫోటో కొద్ది రోజులుగా నెట్టింట తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. రోడ్డు పక్కన పార్కింగ్ ఏరియాలో దీనంగా కూర్చున్న ఆ వృద్ధురాలి ఫొటోతో..

  • Share this:
    దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న కరోనా సెకండ్ వేవ్ తో సామాన్య జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఓ వైపు కూలి పనులకు వెళ్తేనే కాస్త కూడు తినగలిగే పరిస్థితులు, మరో వైపు కుటుంబ ఆర్థిక ఇబ్బందులు వీటికి తోడు కరోనా భయం. ఎక్కడ లాక్ డౌన్ పెడతారో? మళ్లీ ఎన్ని ఇబ్బందులు పడాలో? అని క్షణక్షణం భయపడిపోతున్నారు. దీనికి తోడు మీడియాలో వస్తున్న వార్తలు భయోత్పాతానే సృష్టిస్తున్నాయి. బయట అదే రకమైన వాతావరణం ఉన్నప్పటికీ వచ్చే వార్తల్లో కొన్ని అవాస్తవాలు కూడా ప్రచురితం అవుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని అసత్య ప్రచారాలను కూడా మీడియా తమ కథనాలకు వాడుకుంటోంది. ఆ తర్వాత అదికాస్తా ఫేక్అని తెలిసినా ప్రజలకు చెప్పడం లేదు. తాజాగా అలాంటి ఓ అబద్ధపు ప్రచారం గురించిన కథనమే ఇది.

    ఆక్సిజన్ సిలిండర్ సాయంతో శ్వాస పీల్చుకోగలుగుతున్న ఓ వృద్ధురాలి ఫోటో కొద్ది రోజులుగా నెట్టింట తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. రోడ్డు పక్కన పార్కింగ్ ఏరియాలో దీనంగా కూర్చున్న ఆ వృద్ధురాలి ఫొటోతో నెటిజన్లు అంతా ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఆ ఫొటోను తెగ వైరల్ చేశారు. ‘ఇదీ ఇప్పుడు భారత్ లో పరిస్థితి. వైద్యాధికారులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం నిద్రపోతోందా? కరోనాను అరికట్టడం అంటే ఇదేనా?‘ అంటూ కామెంట్స్ తో నెటిజన్లు రచ్చ రచ్చ చేశారు. సోషల్ మీడియాలోనే కాదు, టీవీల్లో, పేపర్లలో కూడా ఇదే ఫొటో ప్రముఖంగా ప్రచురితం అయింది. దేశంలో ఉన్న ఆక్సిజన్ కొరత వ్యవహారం కూడా ఈ ఫొటోకు మరింత బలాన్ని చేకూర్చింది. అయితే ఆ ఫొటో వెనుక ఉన్న అసలు కథేంటో తెలిసింది.





    వాస్తవానికి ఈ ఫొటో ఇప్పటిది కాదు. ఈ ఫొటోకు కరోనాకు అస్సలు సంబంధం లేదు. కరోనా సెకండ్ వేవ్ వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ ఫొటో నెట్టింట ప్రత్యక్షమయింది. కానీ ఈ ఫొటో మాత్రం 2018వ సంవత్సరం నాటిదని టెక్ నిపుణులు తేల్చేశారు. అంతేకాకుండా ఈ ఫొటో వెనుక ఉన్న అసలు కథేంటన్నది కూడా పలువురు జర్నలిస్టులు వెలుగులోకి తెచ్చారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో 2018వ సంవత్సరంలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన ఫొటో ఇది.


    2018వ సంవత్సరంలోనే యూట్యూబ్ లో ఈ ఫొటోలకు సంబంధించిన కథనం ఒకటి ఏఎన్ఐ వార్తా సంస్థ యూట్యూబ్ చానెల్ లో ప్రచురితం అయింది. ఆక్సిజన్ సిలిండర్ ద్వారా ఓ తల్లి శ్వాస తీసుకుంటుండగా, ఆమె కుమారుడు ఆ ఆక్సిజన్ సిలిండర్ ను భుజాలపై మోయడం, ఆమె రోడ్డు పక్కనే కూర్చోవడం వంటి ఫొటోలు అప్పట్లోనే వైరల్ అయ్యాయి. అంబులెన్స్ కోసం ఎదురుచూస్తోంటే, ఎంతకూ అంబులెన్స్ రాకపోవడంతో ఆ తల్లీకొడుకులు రోడ్డుపక్కనే అలా కూర్చుండిపోయారు. అప్పట్లోనే మీడియాలో ఈ దృశ్యాలు ప్రసారం కావడంతో అధికారులు చర్యలు కూడా తీసుకున్నారు. తాజాగా అవే ఫొటోలను నెట్టింట కొందరు వైరల్ చేస్తుండటం శోచనీయం.
    Published by:Hasaan Kandula
    First published:

    అగ్ర కథనాలు