Home /News /coronavirus-latest-news /

A NEW STUDY FINDS WEARING MASK MIGHT LEAD TO INCREASED TO SOCIAL ANXIETY BA GH

మాస్క్ పెట్టుకోకపోతే కరోనా.. పెట్టుకుంటే.. ఇదిగో ఇలాంటి నష్టం ఉందంట.. సర్వేలో సరికొత్త విషయం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మాస్క్‌ వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. వాటర్‌లూ విశ్వవిద్యాలయానికి చెందిన సైకాలజీ, మెంట

కరోనా మహమ్మారి నుంచి రక్షణకు ఫేస్‌ మాస్క్‌ తప్పనిసరి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ, వైద్యులు, పరిశోధకులు చెబుతూనే ఉన్నారు. అయితే దాని వల్ల ఎంత లాభం ఉందనేది కాస్త పక్కనపెడితే.. నష్టాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. మాస్క్‌ వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. వాటర్‌లూ విశ్వవిద్యాలయానికి చెందిన సైకాలజీ, మెంటల్‌ హెల్త్‌ రీసెర్చి టీమ్‌ ఈ విషయంపై పరిశోధనలు నిర్వహించింది. అందులో తేలిన అంశాలను పేపర్‌ రూపంలో విడుదల చేసింది. మాస్క్‌ల వల్ల మనుషుల్లో మానసిక ఆందోళన పెరుగుతోందని పరిశోధకులు గుర్తించారు. ఇదంతా మాస్క్‌లు ధరించడం వల్లనే అనేది ప్రాథమికంగా నిర్ణయించారు.

వాటర్‌లూ విశ్వవిద్యాలయం పరిశోధనలో తేలిన వివరాల ప్రకారం చూస్తే... గతంలో సోషల్‌ యాంగ్జైటీ (సామాజిక ఆందోళన) లేనివారికి ఇప్పుడు కొత్తగా వచ్చిందని పరిశోధకులు చెబుతున్నారు. మొత్తంగా కరోనా మహమ్మారి వల్ల మానసిక ఆరోగ్యం విషయంలో చాలా ఇబ్బందులు వచ్చాయని చెబుతున్నారు. వాటిలో ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు ఉన్నాయని తేల్చారు. బయటకు వచ్చేటప్పుడు, పది మంది ఉండేటప్పుడు కంటిన్యూగా మాస్క్‌ వేసుకోవడం వల్ల సోషల్‌ కమ్యూనికేషన్‌ సరిగ్గా ఉండటం లేదు. దాని వల్ల సోషల్‌ స్కిల్స్‌ విషయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారట. ఇలాంటి సోషల్‌ ఎంగ్జైటీ డిజార్డర్‌తో 13 శాతం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రజల్లో సోషల్ యాంగ్జైటీ రావడానికి మూడు ఫ్యాక్టర్స్‌ కారణం అవ్వొచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అవి సోషల్‌ నార్మ్స్‌ విషయంలో ప్రజలు హైపర్‌ సెన్సిటివ్‌గా ఆలోచించడం ఒకటి కాగా... సోషల్‌, ఎమోషనల్‌ ఇష్యూస్‌లో పక్షపాతం చూపించడం రెండోది. ఫేసియల్‌ క్యూస్‌ సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల రెండో అంశం జరుగుతోందట. ఇక మూడోది చూస్తే జాగ్రత్త పేరుతో విషయాలను దాచడం. మాస్క్‌ వేసుకోవడం వల్ల అవతలి వ్యక్తి ముఖ కవళికలు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. దీని వల్ల అనవసరమైన విషయాలను ఆందోళన చెందుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు. ఇది ప్రజల ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదంటున్నారు పరిశోధకులు.

అయితే ఈ సమస్య ఒక్కో వ్యక్తికి ఒక్కోలా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. వాళ్లు ఎదుర్కొనే పరిస్థితులపై ఇది ఆధారపడి ఉంటుందట. మాస్క్‌లు పెట్టుకొని ఇంటరాక్ట్‌ అవ్వడం వల్ల సరిగ్గా భావం వ్యక్తపరచలేకపోవడమూ ఓ కారణమట. మాస్క్‌లు ఎల్లకాలం ఉండవని పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని దేశాలు మాస్క్‌ల వాడకంపై సడలింపులు ఇచ్చాయి. కాబట్టి ఈ సోషల్‌ యాంగ్జైటీ పరిస్థితులు ఎక్కువ రోజులు ఉండవని ఆశించొచ్చు.
Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Corona mask, Coronavirus, Covid -19 pandemic

తదుపరి వార్తలు