నూతన భారతదేశానికి ఒక కొత్త గీతం

వన్ నేషన్ వన్ వాయిస్ 'జయతు జయతు భారతం, వసుదైవ కుటుంబకం' అనే ఒక కొత్త గీతం బహుభాషా ప్రదర్శనలో 200 మంది గాయకులను ఒకేచోట చేర్చింది.

news18-telugu
Updated: May 28, 2020, 8:32 PM IST
నూతన భారతదేశానికి ఒక కొత్త గీతం
200 మంది సింగర్స్ ఒకే గీతం
  • Share this:
వన్ నేషన్ వన్ వాయిస్ 'జయతు జయతు భారతం, వసుదైవ కుటుంబకం' అనే ఒక కొత్త గీతం బహుభాషా ప్రదర్శనలో 200 మంది గాయకులను ఒకేచోట చేర్చింది.

Covid-19 మహమ్మారి మునుపెన్నడూ లేనివిధంగా మన సామూహిక బలాన్ని పరీక్షిస్తుంది. స్వాతంత్య్రం తరువాత భారతదేశం అతిపెద్ద ఆరోగ్య పరిస్థితిని ఎదుర్కొంటున్న ఈ సమయంలో మనమందరం కలిసి గళమెత్తి చాటడం మనకెంతో అవసరం. ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్ (ఇస్రా) మరియు వారి ముఖ్య స్పాన్సర్లలో ఒకరిగా Asian Paints కలిసి కరోనా యోధులకు అంకితం చేస్తూ వన్ నేషన్ వన్ వాయిస్ అనే ఒక కొత్త జాతీయ గీతాన్ని విడుదల చేసి, ఈ వినూత్నమైన కళాత్మక ప్రయత్నంతో భారతదేశాన్ని ఒకత్రాటిపైకి తెచ్చి మన బలాన్ని ఎంతో ఉత్తమంగా చాటింది.

మే 17, ఆదివారం విడుదల చేసిన వన్ నేషన్ వన్ వాయిస్ గీతం, జయతు జయతు భారతం, వసుదైక కుటుంబకం అనే అపూర్వమైన పాటను 14 భాషలలో 200 మంది గాయకులు కలిసి ఆలపించారు. నిజానికి ప్రతీ గాయకుడు దూరంగా ఉంటూ ఒకరికొకరు సహకరించుకుంటూ, తమ ఇంటినుండే పాటను పాడడం మరింత విస్మయానికి గురిచేస్తుంది. ఆశా భోంస్లే, అనుప్ జలోటా, ఆల్కా యాగ్నిక్, హరిహరన్, కైలాష్ ఖేర్, కవిత కృష్ణమూర్తి, కుమార్ సాను, మహాలక్ష్మి అయ్యర్, మనో, పంకజ్ ఉధాస్, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, షాన్, సోనూ నిగమ్, సురేష్ భోంస్లే, సురేష్ వాడ్కర్, శైలేంద్ర సింగ్, శ్రీనివాస్, తలాత్ అజీజ్, ఉదిత్ నారాయణ్, శంకర్ మహదేవన్, జస్బీర్ జస్సీ వంటి గొప్ప కళాకారుల బృందం ఈ వీడియోలో పాల్గొంది.

టీవీ, రేడియో, సోషల్ మీడియా, అప్లికేషన్స్, OTT, VOD, ISP, DTH మరియు CRBT తో సహా 100 ప్లాట్‌ఫామ్‌లలో విడుదలైన ఈ పాటకు 100కి పైగా ప్రసార, సామాజిక, విస్తరణ మరియు టెక్ ప్లాట్‌ఫామ్‌లు ప్రసారానికి సహకరిస్తున్నాయి. దీని ప్రసారం ద్వారా వచ్చే మొత్తాన్ని, Covid-19 మహమ్మారి బారిన పడినవారికి ఆర్ధిక సహాయం అందించడానికి స్థాపించిన పీఎమ్ సహాయ నిధికి చేరుతుంది. ఈ పాటకు చెందిన మొదటి సంగ్రహావలోకనం పొందాలనుకుంటున్నారా? అయితే వన్ నేషన్ వన్ వాయిస్ చారిత్రాత్మ ప్రదర్శనను ఈ క్రింద చూడండి.సోనూ నిగమ్, శ్రీనివాస్ మరియు ఇస్రా సీఈఓ సంజయ్ టాండన్ రూపొందించిన ఈ వన్ నేషన్ వన్ వాయిస్ ప్లాట్‌ఫామ్‌కు మద్దతు ఇవ్వడం అనేది Asian Paints కి ఒక గొప్ప అవకాశం. Asian Paints సీఈఓ మరియు ఎండీ అమిత్ సింగల్ " Asian Paints ఎల్లప్పుడూ జాగ్రత్త వహించే ఒక బాధ్యతాయుతమైన బ్రాండ్ గా పేర్కొన్నారు. ఒకే దేశంగా ఈ రోజు మనం ఎదుర్కొంటున్న సవాలుతో కూడిన భవిష్యత్తు మధ్య ఒక చర్య తీసుకోవడానికి ఇంతకంటే మంచి సమయం లేదు. ఇంటితో మనకున్న అనుబంధాన్ని బట్టి చూస్తే, దేశంలోని 200 మంది పేరుగాంచిన కళాకారులు తమ ఇళ్ల నుండి తమ స్వరాలను అందించడం ఎంతో గర్వకారణం. ఒక భారతీయ పౌరుడిగా పీఎమ్ సహాయ నిధికి సహకరించడం ద్వారా మన దేశ పౌరులకు, మహిళలకు మద్దతు అందించడం మాకు మరింత ఉత్సాహాన్ని అందిస్తుంది. వన్ నేషన్ వన్ వాయిస్ కేవలం ఒక గీతం మాత్రమే కాదు, ప్రస్తుత పరిస్థితిలో ప్రజల భావోద్వేగాలను ప్రతిబింబించే ఒక ఉద్యమం. ప్రస్తుతం ఈ సంక్షోభం నుండి బయటపడడానికి ఇది మన దేశాన్ని మునుపటికంటే బలంగా ప్రేరేపిస్తుందని బలంగా నమ్ముతున్నాము. అవసరమైనప్పుడు విరాళం అందించడం Asian Paints ఉదార వ్యక్తిత్వం. ఈ సంస్థ ఇప్పటికే పలు రాష్ట్రాలలోని సీఎం సహాయ నిధికి, పీఎమ్ సహాయ నిధులకు రూ.35 కోట్ల విరాళం అందించింది. తమని భారతదేశపు అతిపెద్ద పెయింట్ సంస్థగా మార్చిన నైతికతను దృష్టిలో ఉంచుకుని ప్రజల జీవితాల పట్ల తమకున్న చింతను ప్రదర్శించారు. ఏదేమైనా వన్ నేషన్ వన్ వాయిస్ ప్రాజెక్ట్ తనదైన సవాళ్ళను ప్రదర్శించింది.

దేశవ్యాప్త సహాకారం అడ్డంకులలో చిక్కుకున్న సమయంలో, ముఖ్యంగా సామజిక దూరం పాటించవలసిన ఈ సమయంలో అటువంటి అతిపెద్ద బృందాన్ని కలిపింది. ప్రారంభ దశలో ఉన్నవారు, చాలామంది కళాకారులకు అవసరమైన రికార్డింగ్ పరికరాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండవు. ఇంట్లో రికార్డు చేసిన వారి స్వరాలను కూడా జాగ్రత్తగా సమన్వయం చేసుకోవలసిన అవసరం ఉంది. సంకల్పం ఉన్న చోట, మార్గం కూడా ఉంటుందన్నట్లు, మొత్తం ప్రపంచమంతా ఒకే కుటుంబంగా భావించి మానవత్వాన్ని చాటుకోవాలనే ప్రత్యేక భారతీయ విలువలను ఈ కళాకారులు తమ ఇళ్ల నుండే మనకు తెలియచేయగలిగారు. వన్ నేషన్ వన్ వాయిస్ ప్లాట్‌ఫామ్ ద్వారా వారి అద్భుతమైన సంగీత ప్రతిభ ను ఒక చోట చేర్చి, సందేశాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దారు. మన సామాజిక భవిష్యత్తు వ్యక్తిగత చర్యలపై ఆధారపడిన సమయంలో, ఇవి నిజంగా జీవితానికి మార్గదర్శకం చూపే గొప్ప విలువలు.
First published: May 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading