అలర్ట్.. తబ్లిగీ జమాత్‌లో పాల్గొన్న వ్యక్తి కరోనాతో మృతి.. ఎక్కడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్ ప్రార్థనలకు హాజరైన ఓ వ్యక్తి కరోనా వైరస్ సోకి మృతిచెందాడు. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

  • Share this:
    ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్‌లో నిర్వహించిన తబ్లిగీ జమాత్‌లో పాల్గొన్న ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. దక్షిణాఫ్రికాకు చెందిన మౌలానా యూసుఫ్ టూట్లా(80) అనే మత బోధకుడు ఢిల్లీలోని మర్కజ్‌లో మార్చి 1 నుంచి 15 వరకు నిర్వహించిన తబ్లిగీ జమాత్‌లో పాల్గొన్నాడు. సమావేశాలు ముగిసిన అనంతరం స్వదేశమైన దక్షిణాఫ్రికాకు వెళ్లాడు. యూసుఫ్ ఇండియా నుంచి స్వస్థలానికి వెళ్లేసరికే కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు యూసుఫ్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేయగా, కరోనా పాజిటివ్ వచ్చినట్టు తేలింది.

    మొదట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నట్టు కన్పించారు. కానీ సోమవారం ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణించిపోయి మంగళవారం మృతిచెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. వారి కుటుంబ సభ్యులు ప్రస్తుతం 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్నారు. ఇదిలావుంటే.. ఢిల్లీలోని మర్కజ్‌లో నిర్వహించిన ఈ జమాత్ కార్యక్రమానికి ఇండియాలోని పలు రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి సైతం పెద్దసంఖ్యలో మత ప్రబోధకులు హాజరయ్యారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల్లోనూ ఈ సమావేశాల్లో పాల్గొన్న మతప్రబోధకులకే ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయి.
    Published by:Narsimha Badhini
    First published: