గుర్రానికీ క్వారంటైన్.. రెడ్ జోన్ నుంచి రావడంతో అలర్ట్

యజమానికి కరోనా పరీక్షలు చేశామని..రిపోర్టులు వచ్చే వరకైనా గుర్రం హోంక్వారంటైన్‌లో ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.

news18-telugu
Updated: May 27, 2020, 3:46 PM IST
గుర్రానికీ క్వారంటైన్.. రెడ్ జోన్ నుంచి రావడంతో అలర్ట్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మన దేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రతి రోజు వేల సంఖ్యలో కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక నిఘా ఉంచారు అధికారులు. వారిని స్క్రీనింగ్ చేసి క్వారంటైన్‌కు పంపుతున్నారు. పరిస్థితిన పట్టి 7 రోజులు అడ్మినిస్ట్రేషన్‌లో ఉంచి.. ఆ తర్వాత హోంక్వారంటైన్‌కు పంపుతున్నారు. ఐతే జమ్మూ కాశ్మీర్‌లో ఓ గుర్రాన్ని సైతం క్వారంటైన్‌కు పంపించారు అధికారులు. ఓ వ్యక్తి కాశ్మీర్‌లోని షోపియన్ జిల్లా నుంచి రాజౌరి జిల్లాకు గుర్రంపై వచ్చాడు. ఆ విషయం తెలుసుకున్న అధికారులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని అడ్మినిస్ట్రేటివ్ క్వారంటైన్‌కు పంపించారు. అంతేకాదు అతడు తీసుకొచ్చిన గుర్రాన్ని కూడా హోం క్వారంటైన్‌లో ఉంచారు. షోపియన్ జిల్లా రెడ్‌జోన్‌లో ఉందని.. అందుకే అక్కడి నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు షోపియన్ జిల్లా అధికారులు చెప్పారు. యజమానికి కరోనా పరీక్షలు చేశామని..రిపోర్టులు వచ్చే వరకైనా గుర్రం హోంక్వారంటైన్‌లో ఉండాలని స్పష్టం చేశారు.

కాగా, జమ్మూ అండ్ కాశ్మీర్ వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం.. ఇప్పటి వరకు అక్కడ 1,759 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 833 మంది కోలుకోగా.. 24 మంది మరణించారు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో 902 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
First published: May 27, 2020, 3:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading