సూపర్ మార్కెట్లో దగ్గిన మహిళ.. రూ.26 లక్షల ఆహార పదార్థాలు పారబోత

సూపర్ మార్కెట్‌లోకి ప్రవేశించి బేకరి ఉత్పత్తులు, మాంసం, పండ్లు, కూరగాయాలుపై పదే పదే దగ్గింది. వెంటనే అప్రమత్తమై సిబ్బంది ఆమెను బయటకు గెంటేశారు

news18-telugu
Updated: March 27, 2020, 2:20 PM IST
సూపర్ మార్కెట్లో దగ్గిన మహిళ.. రూ.26 లక్షల ఆహార పదార్థాలు పారబోత
సూపర్ మార్కెట్‌ని శానిటైజ్ చేస్తున్న సిబ్బంది
  • Share this:
యావత్ ప్రపంచం కరోనా భయంతో వణికిపోతోంది. యూరప్‌తో పాటు అమెరికాలో కోవిడ్-19 మహమ్మారి అల్లకల్లోలం సృష్టిస్తోంది. కరోనా రక్కసి దాటికి జనం పిట్టల్లా రాలుతున్నారు.  అమెరికా పరిస్థితి మరింత దారుణంగా మారింది. కరోనా పాజిటివ్ కేసుల విషయంలో ఇప్పటికై ఇటలీ, చైనాను అగ్రరాజ్యం అధిగమించింది.  ఎవరైనా తుమ్మినా.. దగ్గినా.. జనం భయపడిపోతున్నారు. కరోనా అనుమానితుల చర్యలతో వణికిపోతున్నారు.  కొన్ని చోట్ల దాడులు కూడా జరుగుతున్నాయి. ఐతే ఓ మహిళ దగ్గినందుకు సూపర్ మార్కెట్‌లోని రూ.26 లక్షలు విలువైన ఆహార పదార్థాలను పారబోశారు. పెన్విల్వేనియాలోని హనోవర్‌లో ఈ ఘటన జరిగింది.

స్థానికంగా ఉండే గెర్రిటీ సూపర్ మార్కెట్‌కు గురువారం ఓ మహిళ వచ్చింది. లోపలికి వస్తూనే ముఖానికి ఉన్న మాస్క్‌ను తీసేసి పలుమార్లు దగ్గింది. అంతేకాదు బేకరి ఉత్పత్తులు, మాంసం, పండ్లు, కూరగాయాలుపై పదే పదే దగ్గింది. వెంటనే అప్రమత్తమై సిబ్బంది ఆమెను బయటకు గెంటేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగంలోకి దిగి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళ ఉద్దేశపూర్వకంగానే ఆహారపదార్థాలపై దగ్గినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇప్పటికే అమెరికాను కరోనావైరస్ కకావికలం చేస్తున్న నేపథ్యంలో స్టోర్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్ల ఆరోగ్యం దృష్ట్యా సూపర్ మార్కెట్‌లో ఉన్న 35 వేల డాలర్ల (రూ.26 లక్షలు) విలువైన ఆహార పదార్థాలను పారబోశారు. ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి రసాయనాలు పోసి తగులబెట్టారు. అనంతరం ఆ సూపర్ మార్కెట్ మొత్తాన్ని శానిటైట్ చేశారు. ఇక స్థానికలకు ఆహార పదార్థాల కొరత ఉండకూడదనే ఉద్దేశంతో.. కొన్ని గంటల వ్యవధిలోనే సూపర్ మార్కెట్‌ను మళ్లీ అందుబాటులోకి తెచ్చారు. మళ్లీ ఆహార పదార్థాలతో నింపి కస్టమర్లకు విక్రయిస్తున్నారు. ఐతే స్టోర్‌లో దగ్గిన సదరు మహిళలను అరెస్ట్ చేసిన పోలీసులు.. కరోనా పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో హనోవర్ టౌన్‌షిప్‌లోని ప్రజలు భయంతో వణికిపోయారు.
Published by: Shiva Kumar Addula
First published: March 27, 2020, 2:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading