కరోనా వ్యాక్సిన్ రాగానే మాస్కులు విసిరేయాలనుకుంటున్నారా...అయితే ఇది చదవాల్సిందే...

మార్కెట్లోకి టీకా వస్తే మహమ్మారి ముగుస్తుంది. ప్రతి ఒక్కరూ తమ మాస్కులను విసిరిపారేయొచ్చు. అని అంచనా అనుకుంటున్నారు. కానీ అది తొందరపాటే అవుతుంది. వ్యాక్సిన్ అనేది కరోనాపై ఒక అస్త్రమే కానీ అది చివరి అస్త్రం మాత్రం కాదని నిపుణులు పేర్కొంటున్నారు.

news18-telugu
Updated: August 3, 2020, 6:43 PM IST
కరోనా వ్యాక్సిన్ రాగానే మాస్కులు విసిరేయాలనుకుంటున్నారా...అయితే ఇది చదవాల్సిందే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనావైరస్ వ్యాక్సిన్లు గత వారం హ్యూమన్ ట్రయల్స్ లో చివరి దశలోకి ప్రవేశించాయి. నిజానికి ఇదొక రికార్డు అనే చెప్పాలి. టీకాలు అక్టోబర్‌ లేదా సంవత్సరం ముగిసేలోపు లభిస్తాయని ఫార్మాస్యూటికల్ ఎగ్జిక్యూటివ్‌లు జూలైలోనే అంచనా వేశారు. అయితే టీకా అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఎన్నో అంచనాలు ప్రస్తుతం ప్రజల్లో ఉన్నాయి. అవి మరికొన్ని నెలలు వారిని గజిబిజి చేసే వీలుంది. టీకా వస్తుందా, రాదా అనే సందేహాల నడుమ ప్రస్తుతం మార్కెట్లోకి టీకా ల్యాండ్ కానుంది. ఒక్కసారి మార్కెట్లోకి టీకా వస్తే మహమ్మారి ముగుస్తుంది. ప్రతి ఒక్కరూ తమ మాస్కులను విసిరిపారేయొచ్చు. అని అనుకుంటున్నారు. కానీ అది తొందరపాటే అవుతుంది. వ్యాక్సిన్ అనేది కరోనాపై ఒక అస్త్రమే కానీ అది చివరి అస్త్రం మాత్రం కాదని నిపుణులు పేర్కొంటున్నారు.టీకా అనేది చివరి అస్త్రం కాదు...

"టీకా అనేది ఆఫ్-స్విచ్ లేదా రీసెట్ బటన్ అని అంతా భావిస్తున్నారు, కానీ కాస్త ఏమరపాటు వహించినా తిరిగి మహమ్మారి కాలానికి వెళ్తాము" అని హార్వర్డ్ అంటు వ్యాధులు మరియు రోగనిరోధక శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ యోనాటన్ గ్రాడ్ అన్నారు. కొలంబియా విశ్వవిద్యాలయ వైరాలజిస్ట్ ఏంజెలా రాస్ముస్సేన్ చెప్పినట్లుగా వ్యాక్సిన్ సురక్షితంగా, ప్రభావవంతంగా కనిపిస్తున్నప్పటికీ, అది మహమ్మారి ముగింపు మాత్రం కాదు అని గుర్తించాలన్నారు.

యునైటెడ్ స్టేట్స్ లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు టీకాను అందించేందుకు పంపిణీ నెట్‌వర్క్‌లు, సరఫరా చెయిన్ ద్వారా ఎంతో మందిని కాపాడే వీలుంది. ప్రపంచాన్ని సురక్షితంగా ఉంచడానికి నెలలు లేదా ఎక్కువ సంవత్సరాలు పడుతుందని పేర్కొన్నారు.

అయితే వ్యాక్సిన్ షాట్లు అందుబాటులోకి వచ్చిన వెంటనే టీకా పొందినవారికి, తక్షణమే రక్షణ ఉండదు - రోగనిరోధక వ్యవస్థ వ్యాధి-నిరోధక ప్రతిరోధకాల పూర్తి స్థాయిలో శరీరంలో డెవలప్ కావడానికి కొన్ని వారాలు పడుతుంది. అనేక వ్యాక్సిన్ టెక్నాలజీలకు రోగనిరోధక శక్తిని పెంచడానికి మొదటి వ్యాక్సిన్ షాట్ ప్రభావవంతంగా పనిచేయడానికి వారాల తరబడి సమయం అవసరం.

వ్యాక్సిన్ సక్సెస్ ఎంతో అంచనా వేయలేం...

వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రోగనిరోధక శక్తి అనేది స్వల్పకాలికం లేదా పాక్షికం కావచ్చు, టీకా సరఫరా తర్వాత పదేపదే బూస్టర్‌ డోసులు అవసరమవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రజలు తమ వ్యాక్సిన్ షాట్‌లను అందుకున్న తర్వాత కూడా సామాజిక దూరం, ముసుగులు ధరించాల్సిన అవసరం అవుతుంది. కరోనా వ్యాక్సిన్ వచ్చాక కూడా ప్రజలు మాస్కులు కట్టుకోవడంతోపాటు సోషల్ డిస్టెన్సింగ్‌ ప్రోటోకాల్స్ పాటించడం తప్పదు. వ్యాక్సిన్ కరోనా సోకిన వ్యక్తికి వైరస్ ప్రభావాన్ని తగ్గిస్తుంది కానీ ఆ వ్యక్తిని కలిసిన వారికి హాని జరగకుండా ఆపలేదని నేషనల్ స్కూల్ ఆఫ్ ట్రొపికల్ మెడిసిన్‌కు అసోసియేట్ డీన్‌గా ఉన్న మరియా ఎలెనా బొట్టాజ్జి తెలిపారు.

వ్యాక్సిన్ తీసుకున్న వెంటనే మాస్కు తీసేసి పక్కన పడేయడమనేది భ్రమే. ఇది జరగని పని. అన్నింటికీ అదే పరిష్కారమని ప్రజలు అనుకుంటే అది పొరపాటే’ అని నిపుణులు పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్‌లు అంత పర్ఫెక్ట్‌గా ఉంటాయని తాను భావించడం లేదన్నారు. ఒక టీకా కొన్ని మానవ సమూహాలకు బాగా పనిచేస్తే, జనాభాలో ఒక సమూహానికి అంత ప్రభావవంతంగా పనిచేయకపోవచ్చని పేర్కొన్నారు.

వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడంలో ఒక దేశం లేదా సంస్థ ముందంజలో ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. మొదట ఎవరు అయితే వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తారో... ఫినిషింగ్ లైనుకు ఎవరు చేరుకుంటారనేది రేసుగా మారిపోయింది. కానీ వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా కరోనా వ్యాధి రేసు ముగింపు కాదు, ఇది సంవత్సరాలు కొనసాగవచ్చు.

సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో మాదకద్రవ్యాల అభివృద్ధి పరిశోధనలో నిపుణుడు మైఖేల్ ఎస్. కించ్ మాట్లాడుతూ...హెచ్‌ఐవి / ఎయిడ్స్‌తో వ్యాక్సిన్ తరహాలో తొలి తరం వ్యాక్సిన్ అంతలా ప్రభావం చూపడం లేదని. కరోనా విషయంలోనూ మొదటి తరం టీకాలు మధ్యస్థమైనవి కావచ్చని తన అంచనాగా పేర్కొన్నారు.పోలియో వ్యాక్సిన్ విషయంలో జరిగిన పొరపాటు ఇదే...

సరిగ్గా 6 దశాబ్దాల క్రితం ఏప్రిల్ 12, 1955 న, పోలియోకు వ్యతిరేకంగా వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చింది. దాని ఆవిష్కర్త జోనాస్ సాల్క్ రాత్రికి రాత్రి ఓ హీరో అయ్యాడు. చర్చి గంటలు మోగించి జనం ఒకరినొకరు కౌగిలించుకోవడానికి వీధుల్లోకి పరిగెత్తారని మిచిగాన్ విశ్వవిద్యాలయంలోని వైద్య చరిత్రకారుడు హోవార్డ్ మార్కెల్ గుర్తుచేశారు.

శాస్త్రవేత్తలు పిల్లలకు ముప్పు కలిగించే పోలీయో వ్యాధిని అడ్డుకోవటానికి ప్రయత్నించినప్పటికీ, అది పూర్తిగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. వైరస్ షాట్‌ తీసుకున్న కొందరిలో అది ప్రభావం చూపడంలో విఫలమైంది. వ్యాక్సిన్ ఇచ్చినప్పటికీ సుమారు 40,000 మంది పిల్లలకు పోలియో సోకగా, 51 మందికి శిశు పక్షవాతం సోకింది. ఐదుగురు చనిపోయారు.

పోలీయో టీకా వచ్చినప్పటికీ అది పోలియోకు ముగింపు కాదని తేలింది. రెండేళ్ల కాలంలో, యునైటెడ్ స్టేట్స్‌లో కేసులు 80 శాతం తగ్గాయి, అయితే వ్యాక్సిన్‌ను తయారు చేసినప్పటికీ, అనేక సంవత్సరాలు వ్యాప్తి కొనసాగింది. ఆరు సంవత్సరాల తరువాత, పిల్లల నాలుకపై కరిగే చక్కెర క్యూబ్‌గా ఇవ్వగల ఓరల్ పోలియో వ్యాక్సిన్ ప్రవేశపెట్టారు. 1979 లో యునైటెడ్ స్టేట్స్ పోలీయో రహిత దేశంగా మారింది. వ్యాక్సిన్ వచ్చినా పోలీయో పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు సుమారు మూడు దశాబ్దాల సమయం పట్టిందని మార్కెల్ తెలిపారు.

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్ ఆంథోనీ ఎస్. ఫౌసీ శుక్రవారం కాంగ్రెస్ ముందు సాక్ష్యమిస్తూ, 30,000 మంది, 3 వ దశ క్లినికల్ ట్రయల్ ఇప్పుడే ప్రారంభం అయ్యిందని, జాగ్రత్తగా ఆశాజనకంగా ఉందని. తెలిపారు. ఇక వ్యాక్సిన్ అన్నింటికి పరిష్కారం అని ప్రజలు భావిస్తున్నారని ఇది నిజంగా భయపడే అంశమని టీకాలు ఒక్కోసారి అవి విఫలమవుతాయని తెలిపారు.

ఇప్పటి వరకూ ఆమోదించిన అన్ని టీకాల్లో మీజిల్స్ వ్యాక్సిన్ ఉత్తమమైనదని పేరుంది. వ్యాధిని నివారించడంలో 98 శాతం ప్రభావవంతంగా పనిచేసింది. చాలా వరకూ వ్యాక్సిన్లు 40 నుండి 60 శాతం ప్రభావవంతంగా ఉంటాయి. వ్యాక్సిన్లు వ్యక్తుల సమూహాలలో బాగా పనిచేస్తాయి - వృద్ధులు, ఉదాహరణకు, తక్కువ బలమైన రోగనిరోధక ప్రతిస్పందనలను కలిగి ఉంటారు అధిక-మోతాదు ఫ్లూ వ్యాక్సిన్ అవసరం.

యుఎస్ రెగ్యులేటర్ ప్రకారం కరోనావైరస్ వ్యాక్సిన్ 50 శాతం ప్రభావవంతంగా ఉండాలి. ఒక వ్యాక్సిన్ షాట్ ఆ అందుబాటులో ఉన్న జనాల్లో ఒక బ్యాచ్ కు వైరస్ ను క్లియర్ చేస్తే. ఆ తర్వాత హర్డ్ ఇమ్యూనిటీకి దారి తీస్తుంది. వ్యాప్తిని ఆపడానికి జనాభా రోగనిరోధక శక్తిని కలిగి ఉంటుంది.

వ్యాధి తీవ్రతను ప్రధానంగా తగ్గించే వ్యాక్సిన్ వృద్ధులపై చెడు ఫలితాలు ఇఛ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. అంటువ్యాధులను బాగా నిరోధించే టీకాలు, వృద్ధులలో అంతగా పని చేయకపోవచ్చు, వృద్ధులను రక్షించడానికి ప్రయత్నించడానికి యువ జనాభాకు సూచించబడవచ్చు.
Published by: Krishna Adithya
First published: August 3, 2020, 6:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading