Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    ఒక్క రోజే 9304 మందికి.. దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు..

    దేశంలో కరోనా కేసుల వివరాలు రోజుకో రికార్డు సృష్టిస్తున్నాయి. నిన్న దాదాపు 9వేల కేసులు నమోదు కాగా, కేవలం 24 గంటల తర్వాత మరో 9,304 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

    news18-telugu
    Updated: June 4, 2020, 9:53 AM IST
    ఒక్క రోజే 9304 మందికి.. దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు..
    దేశంలో కరోనా విశ్వరూపం... (credit - NIAID)
    • Share this:
    దేశంలో కరోనా కేసుల వివరాలు రోజుకో రికార్డు సృష్టిస్తున్నాయి. నిన్న దాదాపు 9వేల కేసులు నమోదు కాగా, కేవలం 24 గంటల తర్వాత మరో 9,304 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం మొత్తం 2,16,919 మందికి కరోనా సోకింది. అందులో 1,06,737 యాక్టివ్ కేసులు ఉండగా, 1,04,106 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రికవరీ రేటు 47.99 శాతంగా ఉంది. అటు.. 6075 మరణాలు చోటుచేసుకున్నాయి. నిన్న ఒక్క రోజే 260 మంది వ్యాధితో మరణించారు. రాష్ట్రాల వారీగా చూస్తే ఒక్క మహారాష్ట్రలోనే 74,860 కేసులు నమోదయ్యాయి. అందులో 2587 మంది మరణించారు. ఇంకా 39,944 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

    తెలంగాణ విషయానికి వస్తే.. బుధవారం 129 కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,020కి చేరింది. వీరిలో 448 మంది విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, వలస కార్మికులు ఉన్నారు. కరోనా వైరస్‌‌తో పోరాడుతూ తెలంగాణలో ఇప్పటి వరకు 1556 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 1365 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఏపీలో నిన్న ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య 3279కి చేరాయి. వీటిలో... 2244 మంది డిశ్చార్జి అయ్యారు. 68 మంది మరణించారు. అందువల్ల ఇప్పుడు యాక్టివ్ కేసులు 967గా ఉన్నాయి.

    Published by: Shravan Kumar Bommakanti
    First published: June 4, 2020, 9:53 AM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading