Covid 19 Vaccine: 80శాతం ఉపాధ్యాయుల‌కు టీకా..

(ప్రతీకాత్మక చిత్రం)

ఉపాధ్యాయ దినోత్స‌వం(Teachers day) సంద‌ర్భంగా పాఠ‌శాల‌ల్లోని ఉపాధ్యాయుల‌కు, బోధ‌నేత‌ర సిబ్బందికి టీకాలు వేయాల‌ని కేంద్రం రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను కోరిన విష‌యం తెలిసిందే. టీకా పంపిణీకి సంబంధించిన స‌మాచారాన్ని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది.

  • Share this:
    ఉపాధ్యాయ దినోత్స‌వం(Teachers day) సంద‌ర్భంగా పాఠ‌శాల‌ల్లోని ఉపాధ్యాయుల‌కు, బోధ‌నేత‌ర సిబ్బందికి టీకాలు వేయాల‌ని కేంద్రం రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను కోరిన విష‌యం తెలిసిందే. టీకా పంపిణీకి సంబంధించిన స‌మాచారాన్ని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దేశ‌వ్యాప్తంగా 80శాతం మంది టీచ‌ర్ల‌కు మొద‌టి డోస్ పూర్త‌యింద‌ని పేర్కొంది.
    కేంద్రం ప్ర‌భుత్వం కోవిడ్ 19 టీకా(Covid 19)ను సెప్టెంబ‌ర్ 5 న దేశ వ్యాప్తంగా బోధ‌నా రంగంలో ఉన్న వారంద‌రికీ టీకా వేయాల‌ని రాష్ట్రాల‌ను, కేంద్ర పాలిత ప్రాంత ప్ర‌భుత్వాల‌కు సూచించింది.

    సెకండ్ వేవ్ ముగియ‌లేదు.. 16శాతం మందికి వ్యాక్సినేష‌న్ పూర్తి: కేంద్ర ఆరోగ్య‌శాఖ‌




    ఈ విష‌యంలో ఆయా ప్ర‌భుత్వాలు ప్ర‌త్యేక డ్రైవ్‌లు నిర్వ‌హించి టీకాలు వేశాయి. ఢిల్లోలో 98శాతం మంది ప్ర‌భుత్వ‌, ప్రైవేటు ఉపాధ్యాయులంతా టీకా తీసుకొన్నారు. గ‌త‌వారం త‌మిళ‌నాడు(Tamil Nadu)లో టీచ‌ర్ల‌కు 90శాతం టీకాలు వేశారు. ఉపాధ్యాయుల‌కు టీకాలు వేసే స‌మాచారాన్ని వారానికి రెండుసార్లు గూగుల్ ట్రాక‌ర్‌(Google Traker)లో అప్‌లోడ్ చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు కేంద్రం సూచించింది.
    దేశ వ్యాప్తంగా పాఠ‌శాల‌లు తెరుచుకొంటున్న స‌మ‌యంలో ప్రాధాన్య‌తా(Priority) క్ర‌మంలో ఉపాధ్యాయుల‌కు టీకా వేసేలా కేంద్రం ప్ర‌ణాళిక రూపొందించింది. ఇందు కోసం ఆగ‌స్టు 27 నుంచి ఆగ‌స్టు 31 వ‌ర‌కు రెండు కోట్ల‌కు పైగా అద‌న‌పు వ్యాక్సిన్ డోస్‌ల‌ను రాష్ట్రాల‌కు కేంద్రం పంపిన‌ట్టు ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య తెలిపారు. ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, కర్ణాటక, తెలంగాణ సహా అనేక రాష్ట్రాలు పాఠశాలలను తిరిగి ప్రారంభించాయి.

    Covid 19 Vaccination: కోవిడ్ వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేయాలా? గూగుల్ సెర్చ్, గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తే చాలు




    దశలవారీగా అన్ని రాష్ట్రాలు పాఠశాలలను ప్రారంభిస్తున్నారు. దేశంలో ఇంకా పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ఈ నేప‌థ్యంలో పాఠ‌శాల‌లు(Schools) తెరుస్తున్నందున‌ టీచర్ల‌కు మొద‌ట టీకా వంద‌శాతం అందించాల‌నే ల‌క్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకొంది.

    ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో మూడో వేవ్(Third wave) ముప్పు ఉంద‌నే ఆందోళ‌న ఉంది. అయితే ఇప్ప‌టికే రెండేళ్లుగా బ‌డుల‌కు దూర‌మైన విద్యార్థులు ఇంకా ఆల‌స్యం అయితే న‌ష్ట‌పోతార‌ని ప్ర‌భుత్వం భావించింది. చాలా కాలం బ‌డికి వెళ్ల‌కుంటే పిల్ల‌ల్లో మాన‌సిక స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో దేశ వ్యాప్తంగా విడ‌త‌ల వారీగా పాఠ‌శాల‌ల‌ను తెరుస్తున్నారు. ప్ర‌స్తుతం ప‌లు రాష్ట్రాలు పై త‌ర‌గ‌తుల‌కు(Classes) అధిక ప్రాధాన్య‌తనిస్తూ 9వ త‌ర‌గ‌తి నుంచి 12 వ‌ర‌కు పాఠశాల‌లు తెరుస్తున్నాయి. మ‌రికొన్ని చోట అన్ని త‌ర‌గ‌తులు ప్రారంభిస్తున్నా... క‌చ్చితంగా పాఠ‌శాల‌కు రావాల‌ని నియ‌మం ఏం పెట్ట‌లేదు. అయితే పిల్ల‌ల ద్వారా వైర‌ల్ ఇన్ఫెక్ష‌న్ వ్యాప్తి అధికంగా ఉంటుంద‌ని వారు సూప‌ర్ స్ప్రెడ్డ‌ర్లుగా ఇన్ఫెక్ష‌న్ వ్యాప్తి చేసే అవకాశం ఉంది. ఈ నేప‌థ్యంలో విద్యార్థుల‌కు కాకుండా అంద‌రూ టీకా వేసుకొంటే స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డొచ్చ‌ని ఐసీఎమ్ఆర్ డీజీ (ICMR DG) బ‌ల‌రాం భార్గవ్ సూచించారు.
    Published by:Sharath Chandra
    First published: