ముంబై జైలులో 100 మందికి పైగా ఖైదీలు, పోలీసులకు కరోనా

ఏడేళ్ల కన్న తక్కువ జైలు శిక్షపడిన సుమారు 5వేల మంది ఖైదీలను పెరోల్‌పై విడుదల చేస్తామన్నారు అనిల్ దేశ్‌ముఖ్.

news18-telugu
Updated: May 7, 2020, 10:16 PM IST
ముంబై జైలులో 100 మందికి పైగా ఖైదీలు, పోలీసులకు కరోనా
ఫ్రతీకాత్మక చిత్రం
  • Share this:
మహారాష్ట్రపై కరోనా పంజా విసురుతోంది. అందులోనూ ముంబై నగరాన్ని గజాగజా వణికిస్తోంది. సాధారణ ప్రజలే కాదు..డాక్టర్లు, పోలీసులు కూడా కరోనా బారినపడుతున్నారు. ముంబైలోని ఆర్థర్ రోడ్డు సెంట్రల్ జైలులో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. జైలు ఇప్పటి వరకు 77 మంది ఖైదీలకు కరోనా పాజటివ్ వచ్చినట్లు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు. అంతేకాదు 26 మంది పోలీస్ సిబ్బంది కూడా కరోనా బారినపడినట్లు చెప్పారు. ఖైదీలు, జైలు సిబ్బందికి కలిపి ఈ జైలులో మొత్తం 100కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

కరోనా బారినపడిన ఖైదీలను ప్రత్యేక క్వారంటైన్ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు మహారాష్ట్ర హోంమంత్రి చెప్పారు. మిగతా ఖైదీలకు సోకకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఏడేళ్ల కన్న తక్కువ జైలు శిక్షపడిన సుమారు 5వేల మంది ఖైదీలను పెరోల్‌పై విడుదల చేస్తామన్నారు అనిల్ దేశ్‌ముఖ్.కాగా, గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో ఏకంగా 1362 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 18,120కి చేరింది. అటు ముంబైలోని ధారవి మురికివాడలో ఇవాళ 50 కొత్త కేసులు నమోదయ్యాయి. అక్కడ ఇప్పటి వరకు మొత్తం 783 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

గురువారం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 3,561 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటి వరకు 52,952 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 1,783 మరణాలు నమోదయ్యాయి. 35,902 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 1,084 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 15,267 మంది కోలుకున్నారు.
First published: May 7, 2020, 10:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading