హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

టీటీడీలో 743 మందికి కరోనా పాజిటివ్...

టీటీడీలో 743 మందికి కరోనా పాజిటివ్...

తిరుమల శ్రీవారి ఆలయం

తిరుమల శ్రీవారి ఆలయం

తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే 743 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయిందని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.

    తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే 743 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయిందని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. అందులో ఇప్పటి వరకు 400 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 338 మంది ప్రస్తుతం యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే, టీటీడీలో ఇప్పటి వరకు ఐదుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోయినట్టు అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఇక కరోనా లాక్ డౌన్ కారణంగా భక్తులు రాకపోవడంతో టీటీడీ హుండీ ఆదాయానికి భారీ గండి పడింది. గత నెలలో హుండీ ఆదాయం రూ.16 కోట్లు మాత్రమే వచ్చింది. E-Hundi ద్వారా రూ.3కోట్ల ఆదాయం వచ్చినట్టు చెప్పారు. టీటీడీ వార్షిక బడ్జెట్ రూ.3200 కోట్లు. అందులో ఉద్యోగుల జీతభత్యాలకే రూ.1350 కోట్లు ఖర్చవుతుంది. ప్రస్తుతం వస్తున్న ఆదాయంతో జీతాలకు కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో టీటీడీ ఖర్చులు తగ్గించుకుంటోంది. ఎంత తగ్గించుకున్నా నెలకు రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల ఖర్చు అవుతుంది. ఇప్పటి వరకు కార్పస్ ఫండ్ నుంచి ఎలాంటి నిధులు తీసుకోలేదు. అవసరం అయిన పక్షంలో భవిష్యత్తులో టీటీడీ బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఆగస్టు నెలాఖరులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే కోవిడ్ 19 నిబంధనలను బట్టి శ్రీవారి బ్రహ్మోత్సవాలు భక్తుల సమక్షంలోనే నిర్ణయించాలా? లేకపోతే ఏకాంతంగానే నిర్ణయించాలా అనేదానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. శ్రీవారి కల్యాణోత్సవాలను ఆపాలని అర్చకులు తమతో చర్చించలేదన్నారు. అర్చకులు ఏ సలహా ఇచ్చినా మేము సీరియస్‌గానే స్పందిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు పాజిటీవ్ వచ్చి తగ్గిన అర్చకుల్లో ఎక్కువ మంది తిరిగి డ్యూటీలకు అటెండ్ అవుతున్నారని తెలిపారు.. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న అర్చకులకు తిరుమలలో విధులు ఇవ్వవద్దని ప్రధానార్చకులకు చెప్పామన్నారు.

    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Tirumala news, Tirumala tirupati devasthanam, Ttd

    ఉత్తమ కథలు