భారత్‌లో 9వ కరోనా మరణం.. హిమాచల్‌లో శరణార్థి మృతి

మనదేశంలో ఇప్పటి వరకు 467 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 34 మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

news18-telugu
Updated: March 23, 2020, 9:43 PM IST
భారత్‌లో 9వ కరోనా మరణం.. హిమాచల్‌లో శరణార్థి మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భారత్‌లో కరోనా మరణాల సంఖ్య పెరుగుతోంది. తాజగా హిమాచల్ ప్రదేశ్‌లో 69 ఏళ్ల వృద్ధుడు చనిపోయారు. మృతుడు టిబెట్ నుంచి వలస వచ్చి హిమాచల్ ప్రదేశ్‌లో శరణార్థిగా ఉంటున్నాడు. అమెరికాలో పర్యటించిన అతడు మార్చి 15న తిరిగి వచ్చాడు. మూడు రోజుల క్రితం అనారోగ్యంతో తండాలోని ఓ ఆస్పత్రిలో చేరాడు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అతడికి సంబంధించిన శాంపిల్స్‌ను పరీక్షించగా కరోనా పాజిటివ్ వచ్చింది. హిమాచల్ ప్రదేశ్‌లో తొలి కరోనా మరణం ఇదేనని రాష్ట్ర అధికారులు తెలిపారు.


కాగా, మనదేశంలో ఇప్పటి వరకు 468 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 34 మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా.. మరో 8 మంది చనిపోయారని కాసేపటి క్రితం కేంద్ర వైద్యఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. ఐతే హిమాచల్‌లో చనిపోయిన వృద్ధుడకి కరోనా ఉందని తేలడంతో.. భారత్‌లో మరణాల సంఖ్య 9 మంది చేరింది.
First published: March 23, 2020, 8:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading