ఆస్పత్రి పైనుంచి దూకిన 66 ఏళ్ల కరోనా రోగి.. గుంటూరులో దారుణం

శుక్రవారం ఉదయం ఆస్పత్రి భవనం మూడో అంతస్తు నుంచి కిందకు దూకాడు. తలతో పాటు కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి.

news18-telugu
Updated: August 14, 2020, 9:41 AM IST
ఆస్పత్రి పైనుంచి దూకిన 66 ఏళ్ల కరోనా రోగి.. గుంటూరులో దారుణం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో ఓ కరోనా రోగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తాను చికిత్స పొందుతున్న ఆస్పత్రి భవనం పైనుంచే కిందకు దూకాడు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గుంటూరు మారుతినగర్‌కు చెందిన 66 ఏళ్ల వ్యక్తికి ఇటీవలే కరోనా నిర్ధారణ అయింది. వైద్యుల సలహాలతో చినకాకానిలో ఎన్నారై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఐతే శుక్రవారం ఉదయం ఆస్పత్రి భవనం మూడో అంతస్తు నుంచి కిందకు దూకాడు. తలతో పాటు కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రి సిబ్బంది హుటాహుటిన అత్యవసర విభాగానికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకొని వివరాలు సేకరించారు. ఘటనపై వివరాలు సేకరించారు. కాగా, ఆంధప్రదేశ్‌లో గురువారం 9,996 కొత్త కేసులు నమోదవగా.. మరో 82 మంది మరణించారు. ఇప్పటి వరకు 2,64,142కి చేరింది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,378కి పెరిగింది. రాష్ట్రంలో కరోనా నుంచి 1,70,924 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 90,840 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో 55,692 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు 27,05,459 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది.
Published by: Shiva Kumar Addula
First published: August 14, 2020, 9:34 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading