ఏపీలో 15వేల దాటిన కరోనా కేసులు... 200కు చేరువలో మరణాలు

కరోనా పరీక్షల విషయంలో అన్ని రాష్ట్రాల కంటే ముందున్న ఏపీలో మొత్తం పరీక్షల సంఖ్య 9.18 లక్షలకు చేరుకుంది.

news18-telugu
Updated: July 1, 2020, 1:29 PM IST
ఏపీలో 15వేల దాటిన కరోనా కేసులు... 200కు చేరువలో మరణాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీ కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 657 కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లు 39 మంది ఉండగా, విదేశాల నుంచి వచ్చిన వారు ఏడుగురు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 15252కు చేరింది. 342 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 6988కు చేరింది. రాష్ట్రంతో ప్రస్తుతం 8071 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఆరుగురు చనిపోయారు. కృష్ణా జిల్లాలో ముగ్గురు, కర్నూలు జిల్లాలో ముగ్గురు కరోనా కారణంగా చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 193కు చేరుకుంది. ఇక కరోనా పరీక్షల విషయంలో అన్ని రాష్ట్రాల కంటే ముందున్న ఏపీలో మొత్తం పరీక్షల సంఖ్య 9.18 లక్షలకు చేరుకుంది.



గడిచిన 24 గంటల్లో అనంతపురం 118, చిత్తూరు 35, తూర్పు గోదావరి 80, గుంటూరు 77, కడప 60, కర్నూలు 90, నెల్లూరు 33, ప్రకాశం 28, విశాఖ 21, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 15 కేసులు నమోదయ్యాయి.


First published: July 1, 2020, 1:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading