తెలంగాణలో ఇవాళ ఒక్కరోజే 62 కరోనా కేసులు... మరో ముగ్గురు మృతి

తెలంగాణలో ఇవాళ ఒక్క రోజే 62 కరోనా కేసులు నమోదయ్యాయి.

news18-telugu
Updated: May 22, 2020, 9:56 PM IST
తెలంగాణలో ఇవాళ ఒక్కరోజే 62 కరోనా కేసులు... మరో ముగ్గురు మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. శుక్రవారం 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. శుక్రవారం ఏడుగురు బాధితులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. ముగ్గురు చనిపోయారు. ఇవాళ GHMC పరిధిలో 42, రంగారెడ్డిలో ఒకరితో పాటు పాటు మరో 19 మంది వలస కార్మికులకు కరోనా సోకింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వలస కూలీల సంఖ్య 118కు చేరింది. ఇక తాజా లెక్కలతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1761కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 1,048 మంది కోలుకోగా.. 48 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 670 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.

వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. మరో 25 జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. గత 14 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాని జిల్లాల్లో కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, భూపాలపల్లి,నాగర్ కర్నూల్, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, మహబూబాబాబ్, మంచిర్యాల, భద్రాద్రి, వికారాబాద్, నల్గొండ, అసిఫాబాద్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట, నారాయణపేట, వరంగల్ అర్బన్, జనగాం, గద్వాల, నిర్మల్ ఉన్నాయి.

cm kcr review meeting,telangana deaths, corona cases in telangana, corona virus, covid-19, telugu news, telangana updates, కేసీఆర్ సమీక్షా సమావేశం, తెలంగాణలో కరోనా మరణాలు,
ప్రభుత్వం విడుదల చేసిన కరోనా బులెటిన్


First published: May 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading