Home /News /coronavirus-latest-news /

600 VILLAGERS TESTS POSITIVE FOR CORONAVIRUS IN YERRAVALLI IN VIKARABAD SU

Telangana: గ్రామంలో 600 మందికి కరోనా.. ఊరు ఖాళీ చేసిన జనాలు.. పాపం ఎక్కడ ఉంటున్నారంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా భయంతో ఓ గ్రామ ప్రజలు వణికిపోతున్నారు. గ్రామంలో 600 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో.. ఊరు ఖాళీ చేశారు.

    కరోనా వైరస్ సృష్టిస్తున్న అలజడి అంతా ఇంతా కాదు. చాలా మంది జీవితాలను అతలకుతం చేస్తోంది. తాజాగా కరోనా దెబ్బకు ఓ గ్రామం ఖాళీ అయిపోయింది. గ్రామంలో 600 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో గ్రామంలోని జనాలు ఊరి ఖాళీ చేశారు. ఊరి బయట పొలాల్లో గుడిసెలు వేసుకుని భయం భయంగా జీవనం సాగిస్తున్నారు. జనాలు ఊరు ఖాళీ చేయడంతో.. వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఈ పరిస్థితి వికారాబాద్ జిల్లా ఎర్రవల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. ఎర్రవల్లి గ్రామ జనాభా 1400 మంది కాగా, అందులో 600 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వారం క్రితం కరోనా బారినపడ్డ ఇద్దరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి మరణించారు. దీంతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు.

    దీంతో గ్రామస్తులు.. తమ ఇళ్లను వదిలి.. వ్యవసాయ పొలాల వద్ద గుడిసెలు వేసుకుని.. ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. అక్కడే క్వారంటైన్ అయ్యారు. అయితే గ్రామంలో ఇన్ని కరోనా పాజిటివ్ కేసులు నమోదైన అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శ వినిపిస్తోంది. గ్రామంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి.. అందరికీ పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్‌కు విన్నవించినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కొందరు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    Indian- American Siblings: భారత్​కు బాసటగా నిలిచిన ముగ్గురు ఇండో అమెరికన్​ టీనేజర్లు.. వీరు చేసిన పని తెలిస్తే హ్యాట్సాఫ్​ చెబుతారు..

    పెళ్లి వేడుక 3 గంటల్లో పూర్తవ్వాలి.. 31 మంది మాత్రమే హాజరుకావాలి.. లేదంటే భారీ జరిమానా.. ఎక్కడంటే..

    కరోనాతో చనిపోయినవారి మృతదేహాలను.. కో ఆప్షన్ మెంబర్ జాఫర్ జేసీబీల సాయంతో గుంత తవ్వించి పూడ్చివేయిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి రోజు ఒక ఏఎన్‌ఎం వచ్చి వెళ్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో ఎప్పుడు ఎవరూ చనిపోతారో అనే భయం పట్టుకుందని.. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Coronavirus, Covid-19, Telangana, Vikarabad

    తదుపరి వార్తలు