రాజస్థాన్‌లో చిక్కుకున్న 600 మంది తెలుగువాళ్లు.. తీవ్ర ఇబ్బందులు పడుతూ..

ప్రతీకాత్మక చిత్రం

లాక్‌డౌన్ కారణంగా రాజస్థాన్‌లో 600 మంది తెలుగు రాష్ట్రాల ప్రజలు చిక్కుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన బ్రహ్మకుమారీలు గత నెల 17న రాజస్థాన్‌లోని మౌంట్ అబులో జరిగిన సమావేశానికి వెళ్లారు.

  • Share this:
    లాక్‌డౌన్ కారణంగా రాజస్థాన్‌లో 600 మంది తెలుగు రాష్ట్రాల ప్రజలు చిక్కుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన బ్రహ్మకుమారీలు గత నెల 17న రాజస్థాన్‌లోని మౌంట్ అబులో జరిగిన సమావేశానికి వెళ్లారు. వాళ్లు మార్చి 24న తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది. కానీ.. అంతకుముందు రోజే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో వాళ్లు అక్కడే ఉండిపోయారు. దీంతో అప్పటి నుంచి ఇప్పటి దాకా వాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహారాష్ట్రకు చెందిన 1600 మందితో మొత్తం 6వేల మంది అక్కడ చిక్కుకుపోయారు. అయితే, కొన్ని రోజుల నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రానికి చెందిన వాళ్లను సొంత రాష్ట్రానికి తరలించింది. ఈ నేపథ్యంలో తమను కూడా స్వస్థలాలకు చేర్చేలా చర్యలు తీసుకోవాలని తెలుగు బాధితులు ప్రభుత్వాలను వేడుకుంటున్నారు.

    మౌంట్ అబులో చిక్కుకున్న వారిలో చాలా మంది రైతు కుటుంబాలకు చెందినవారేనని, ప్రస్తుతం పంట కోత దశలో ఉందని.. తాము లేకపోతే పంట మొత్తం నాశనం అవుతుందని ఆందోళన చెందుతున్నారు. తమను స్వస్థలాలకు చేర్చేలా చొరవ తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ సీఎం జగన్, చంద్రబాబులను వేడుకుంటున్నారు.


    Published by:Shravan Kumar Bommakanti
    First published: