హైదరాబాద్‌లో దారుణం.. ప్రైవేట్ ఆస్పత్రిలో ఉరేసుకొని కరోనా రోగి ఆత్మహత్య

నాలుగు రోజుల క్రితమే ఆయన ఆస్పత్రిలో చేరాడని.. కరోనా భయంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమికంగా భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

news18-telugu
Updated: August 11, 2020, 8:23 PM IST
హైదరాబాద్‌లో దారుణం.. ప్రైవేట్ ఆస్పత్రిలో ఉరేసుకొని కరోనా రోగి ఆత్మహత్య
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. తన వార్డులోని వాష్‌రూమ్‌లో ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లాకు చెందిన 60 ఏళ్ల వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపించడంతో కొన్ని రోజుల క్రితం పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టుల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. డాక్టర్ల సలహా మేరకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఐతే అర్ధరాత్రి 1 గంటల సమయంలో ఆస్పత్రిలోని బాత్‌రూమ్‌లో ఉరేసుకొని మరణించారు. వార్డులో అతడు కనిపించకపోవడంతో నర్సులు చుట్టుపక్కల వెతికారు. ఈ క్రమంలో ఆస్పత్రిలోని బాత్రూమ్‌లో ఆయన శవం కనిపించింది.

ఆస్పత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. నాలుగు రోజుల క్రితమే ఆయన ఆస్పత్రిలో చేరాడని.. కరోనా భయంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమికంగా భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చినప్పటి నుంచీ ఆందోళన చెందుతున్నాడని.. ఏం జరుగుతుందోన్న టెన్షన్‌తో మానసిక ఒత్తిడికి గురైనట్లు మృతుడి బంధువులు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 1896 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 82647కు చేరింది. కరోనా కారణంగా కొత్తగా 8 మంది కన్నుమూశారు. రాష్ట్రంలో వైరస్ మహమ్మారి బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 645కు చేరింది. అయితే కరోనా నుంచి కోలుకుంటున్న వారి శాతం తెలంగాణలో అధికంగా ఉంది. గడిచిన 24 గంటల్లో మొత్తం 1788 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 59374 మంది ఈ వైరస్‌ను జయించారు..
Published by: Shiva Kumar Addula
First published: August 11, 2020, 8:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading