కరోనా లేటెస్ట్ హెల్త్ బులిటెన్.. దేశంలో 540 కొత్త కేసులు.. 17 మరణాలు..

కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఈ రోజు (గురువారం) ఉదయం 8 గంటల వరకు దేశంలో మొత్తం 5,734 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

news18-telugu
Updated: April 9, 2020, 9:03 AM IST
కరోనా లేటెస్ట్ హెల్త్ బులిటెన్.. దేశంలో 540 కొత్త కేసులు.. 17 మరణాలు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఈ రోజు (గురువారం) ఉదయం 8 గంటల వరకు దేశంలో మొత్తం 5,734 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 166 మంది మృతి చెందగా, 473 మంది డిశ్చార్చి అయ్యారు. 5,095 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో కొత్తగా 540 కేసులు నమోదు కాగా, 17 మరణాలు చోటుచేసుకున్నాయి. కాగా, అత్యధికంగా మహారాష్ట్రలో 1135 కరోనా కేసులు నమోదు కాగా, 117 మంది చనిపోయారు. ఆ తర్వాత తమిళనాడు(738), ఢిల్లీ(669), తెలంగాణ(427), రాజస్థాన్ (381), ఉత్తర ప్రదేశ్ (361), ఆంధ్రప్రదేశ్ (348), కేరళ (345) ఉన్నాయి.

కరోనా హెల్ప్‌లైన్ నంబర్లు:

కరోనా హెల్ప్‌లైన్ నంబర్లు
First published: April 9, 2020, 9:03 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading