ప్రభుత్వ షెల్టర్ హోమ్‌లో 57 మంది అమ్మాయిలకు కరోనా.. ఐదుగురికి గర్భం

ప్రభుత్వ షెల్టర్ హోమ్‌లో 57 మంది అమ్మాయిలకు కరోనా.. ఐదుగురికి గర్భం

ప్రతీకాత్మక చిత్రం

షెల్టర్ హోమ్‌కు రాకముందు నుంచే వారు గర్భంతో ఉన్నారని చెప్పారు. ఐతే ఆ బాలికలకు గర్భం ఎలా వచ్చిందన్న దానిపై పోక్సో చట్టం కింద దర్యాప్తు చేపడతామని తెలిపారు

 • Share this:
  యూపీలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కాన్పూర్‌లోని ఓ ప్రభుత్వ బాలికల ఆశ్రయ గృహం (షెల్టర్ హోమ్)లో 57 మందికి బాలికలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అందులోనూ మరో షాకింగ్ విషయం ఏంటంటే..వారిలో ఐదుగురు అమ్మాయిలు గర్భంతో ఉన్నారు. మరొకరికి హెచ్ఐవీ ఉన్నట్టు పరీక్షల్లో తేలింది. మొదట ఈ వార్తను పుకారు భావించారు అక్కడి ప్రజలు. కానీ అధికారులు ధృవీకరిచడంతో ఇప్పుడు ఆందోళన పడుతున్నారు. ఒక్క షెల్టర్ హోమ్‌లో ఇంత మందికి కరోనా సోకడంతో.. అధికారులు సైతం అప్రమత్తమయ్యారు.

  బాధితులందరినీ ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. అనంతరం షెల్టర్ హోమ్‌ని మూసివేసి.. మిగిలిన అమ్మాయిులు, సిబ్బందిని క్వారంటన్ సెంటర్‌లో ఉంచారు. ఈ షెల్టర్ హోమ్‌లో మొత్తం ఏడుగురు గర్భిణీలు ఉండగా.. వారిలో ఐదుగురు కరోనా బారినపడినట్లు అధికారులు వెల్లడించారు. ఐతే వారి వయసును మాత్రం బయటపెట్టలేదు. ఐతే షెల్టర్ హోమ్‌కు రాకముందు నుంచే వారు గర్భంతో ఉన్నారని చెప్పారు. ఐతే ఆ బాలికలకు గర్భం ఎలా వచ్చిందన్న దానిపై పోక్సో చట్టం కింద దర్యాప్తు చేపడతామని తెలిపారు. షెల్టర్ హోమ్‌లో పురుషులు ఎవరూ ఉండరని స్పష్ట చేశారు. కాగా,ఈ వ్యవహారం ఇప్పుడు యూపీలో హాట్ టాపిక్‌గా మారింది.

  యూపీలో ఇప్పటి వరకు 17,731 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహ్మారితో పోరాడుతూ 10,995 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 550 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,186 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
  First published:

  అగ్ర కథనాలు