Karnataka: ఆ గ్రామంలో టెన్షన్ టెన్షన్.. సగం మందికి కరోనా పాజిటివ్.. అసలు కారణమదేనా..?

Karnataka: ఆ గ్రామంలో టెన్షన్ టెన్షన్.. సగం మందికి కరోనా పాజిటివ్.. అసలు కారణమదేనా..?

ప్రతీకాత్మక చిత్రం

కరోనా సెకండ్ వేవ్ తో సామాన్య ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని ఓ ఊళ్లో సగం మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.

  • Share this:
    దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్ర కల్లోలాన్ని సృష్టిస్తోంది. గతేడాది నమోదైన కేసుల కంటే ప్రస్తుతం రోజు వారీగా నమోదవుతున్న కేసుల సంఖ్యే ఎక్కువ కావడంతో అంతాటా భయాందోళనలు నెలకొన్నాయి. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టాయి. లాక్ డౌన్ పెట్టే స్థితి రానివ్వకుండా ప్రస్తుతానికి ఎక్కడికక్కడ ఆంక్షలను విధిస్తున్నారు. తెలంగాణలో కూడా రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 5గంటల వరకు కర్ఫ్యూని విధిస్తున్నారు. అయినప్పటికి కరోనా కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ప్రజలు మాస్కులు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడం, శానిటైజర్లను విరివిగా వాడకపోవడం వల్లే ఈ పరిస్థితి వస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని ఓ ఊళ్లో సగం మందికి కరోనా రావడం ఆ గ్రామంలో తీవ్ర కలకలాన్ని రేపుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    కర్ణాటక రాష్ట్రంలోని బెలగావి జిల్లా ఖానాపూర్ తాలూకా ఆబానలి గ్రామంలో సగానికి సగం మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఆ గ్రామంలో మొత్తం 300 మంది వరకు ప్రజలు ఉన్నారు. వారిలో కరోనా లక్షణాలు 150 మందికి ర్యాపిడ్ యాంటీజన్ టెస్టులు నిర్వహించారు. వారిలో 144 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు మంగళవారం నిర్ధారణ అయింది. దీంతో ఆ గ్రామానికి రాకపోకలను నిషేధిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన వారికి కూడా కరోనా చికిత్సలు నిర్వహిస్తామనీ, పాజిటివ్ వచ్చిన వారిని హోం క్వారంటైన్ లో ఉంచి నిరంతరం వైద్య చికిత్సలు అందిస్తామని అధికారులు చెబుతున్నారు.
    ఇది కూడా చదవండి: Viral Video: వావ్.. ఏం నటన గురూ.. అదరగొట్టేశావ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.. ఫన్నీ కామెంట్స్ తో సెటైర్లు..!

    కాగా, పాజిటివ్ వచ్చిన వారంతా రోజు వారీ కూలి పనులకు వెళ్లేవాళ్లే కావడం గమనార్హం. వారిలో అత్యధిక శాతం మంది ఇటీవలే మహారాష్ట్ర నుంచి తిరిగి తమ సొంతూరికి వచ్చారు. అలా వచ్చిన వారి నుంచే గ్రామంలో కరోనా ప్రబలి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొదటగా ఇద్దరు గ్రామస్తులు వెళ్లి కరోనా చికిత్సలు చేయమని అడిగారనీ, వారికి ఉన్నట్టే గ్రామంలో మరికొంత మందికి లక్షణాలు ఉన్నాయని తెలియడంతో నేరుగా గ్రామంలోనే టెస్టులను నిర్వహించామని వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రజలంతా కరోనా సెకండ్ వేవ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు.
    ఇది కూడా చదవండి: భర్త దారుణ హత్య.. పర్సు తీసుకొస్తానని పోలీసులకు చెప్పి ఇంట్లోకి వెళ్లిన భార్య.. ఎంతకూ తిరిగి రాకపోవడంతో వెళ్లి చూస్తే..
    Published by:Hasaan Kandula
    First published: