హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Covid In UK : బ్రిటన్ లో మళ్లీ కరోనా సునామీ..వారానికి దాదాపు 50 లక్షల పాజిటివ్ కేసులు

Covid In UK : బ్రిటన్ లో మళ్లీ కరోనా సునామీ..వారానికి దాదాపు 50 లక్షల పాజిటివ్ కేసులు

గడిచిన రెండు రోజులుగా కొత్త కేసులు భారీగా, 16వేల పైచిలుకు వస్తున్నా, రికవరీలు గణనీయంగా పెరగడంతో యాక్టివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం దేశంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 1,25,076 గా ఉంది. యాక్టివ్ కేసుల రేటు 0.28శాతంగా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)

గడిచిన రెండు రోజులుగా కొత్త కేసులు భారీగా, 16వేల పైచిలుకు వస్తున్నా, రికవరీలు గణనీయంగా పెరగడంతో యాక్టివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం దేశంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 1,25,076 గా ఉంది. యాక్టివ్ కేసుల రేటు 0.28శాతంగా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)

Covid Situation In Britan: తాజా కేసుల పెరుగుదలకు ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ తీసుకున్న నిర్ణయాలే కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఫిబ్రవరి నెలలోనే అన్ని రకాల కరోనా ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. ఆ తర్వాత కొవిడ్‌ కేసులు మళ్లీ పెరిగినట్లు తెలుస్తోంది. 

ఇంకా చదవండి ...

COVID-19 CASES RISING IN UK:కరోని మహమ్మారి ఖతం అయ్యిందని ప్రశాంతంగా జీవిస్తున్న ప్రజలకు మరోసారి పిడుగులాంటి వార్త వచ్చి పడింది. బ్రిటన్ లో మళ్లీ ఆందోళనకర పరస్థితులు నెలకొన్నాయి. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BA.2 ఒప్పుడు బ్రిటన్ ను వణికిస్తోంది. వేగంగా వ్యాపిస్తున్న ఈ వేరియంట్ కారణంగా కొద్ది రోజులుగా బ్రిటన్ లో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గత వారం బ్రిటన్ లో 49లక్షల మంది వైరస్‌ బారినపడినట్లు ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది. గడిచిన వారం రోజుల్లో దేశంలోని ప్రతి 13 మందిలో ఒకరు కరోనా బారిన పడినట్లు బ్రిటన్‌ అధికార గణాంకాలు తెలిపాయి. ఇక,అంతకుముందు వారం 4.3 మిలియన్ల మందికి కొవిడ్‌ సోకింది. తాజా కేసుల పెరుగుదలకు ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ తీసుకున్న నిర్ణయాలే కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఫిబ్రవరి నెలలోనే అన్ని రకాల కరోనా ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. ఆ తర్వాత కొవిడ్‌ కేసులు మళ్లీ పెరిగినట్లు తెలుస్తోంది. అయితే,కరోనా తీవ్ర విజృంభణతో బ్రిటన్‌ హాస్పిటల్స్ లోచేరేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నప్పటికీ.. మరణాల రేటు తక్కువగా నమోదవుతుంది. ఈ ఏడాది ప్రారంభంతో పోలిస్తే,మృతుల సంఖ్య తక్కువగానే ఉందని గణాంకాలు తెలుపుతున్నాయి.

మరోవైపు,కరోనా వేరియంట్ సరికొత్త రూపం ఎక్స్ఈ ప్రపంచానికి కొత్త తలపోటుగా మారింది. వేరియంట్ లో ఒకానొక మ్యూటెంగ్ గా కనుగొన్న ఎక్స్ఈని సరికొత్త వేరియంట్ గా గుర్తించడానికి అవసరమైన లక్షణాలన్నీ ఉన్నట్లు వెల్లడైంది. కొత్త వేరియంట్‌ను ఎక్స్‌ఇగా పేర్కొంటుండగా... గత కోవిడ్‌ మ్యూటెంట్ల కన్నా, వ్యాప్తి అధికంగా ఉండవచ్చునని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. ఎక్స్‌ఈ అనేది రీకాంబినెంట్‌.. ఒమిక్రాన్‌ వేరియంట్లు బిఎ1, బిఎ2 నుండి రూపాంతరం చెందింది. కొత్త వేరియంట్ ఎక్స్ఈపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను అప్రమత్తం చేసింది. కరోనా బీఏ2 ఒమిక్రాన్ తో పోలిస్తే ఒమిక్రాన్ ఎక్స్ఈ సబ్ వేరియంట్10 శాతం వృధ్ధిరేటు ఉందని డబ్ల్యూహెచ్ఓ ఎపిడెమియోలాజికల్ నివేదికలో హెచ్చరించింది.

ALSO READ XE Variant : మళ్లీ కరోనా పీడ.. ఒమిక్రాన్ కంటే వేగంగా ఎక్స్ఈ వేరియంట్ వ్యాప్తి: WHO వార్నింగ్

ఎక్స్ఈ కరోనా వేరియంట్ మొదటిసారి యూకే(బ్రిటన్)లో జనవరి 19వతేదీన కనుగొన్నామని, 600 కంటే ఎక్కువ ఎక్స్ఈ కేసులు నిర్దారణ అయ్యాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఎక్స్ఈ వంటి రీకాంబినెంట్ వేరియంట్‌లకు సంబంధించిన పబ్లిక్ హెల్త్ రిస్క్‌ను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ చీఫ్ మెడికల్ అడ్వైజర్ సుసాన్ హాప్కిన్స్ చెప్పారు. యూకే తర్వాత యూఎస్ లోనూ ఎక్కువ సంఖ్యలో కొత్త కోవిడ్ కేసులు నమోదవుతున్నాయన్నారు. ఎక్స్ఈ తీవ్రత, వేగం వంటి లక్షణాలను గుర్తించబడే వరకు ఇది ఓమిక్రాన్ వేరియంట్ లో భాగంగానే వర్గీకరిస్తామమని WHO తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ వీ1.1.529, బీఏ 1, బీఏ2 మరియు బీఏ3తో సహా నాలుగు వేరియంట్లను కలిగి ఉంటుందని తెలిపింది.

First published:

Tags: Coroana cases, Covid -19 pandemic, Uk

ఉత్తమ కథలు